పెళ్లి జరగాల్సిన టైమ్‌లో వరుడి మాటలకు అంతా షాక్.. ఎంత చెప్పినా వినలేదని వధువు బంధువులంతా కలిసి..

ABN , First Publish Date - 2021-12-19T03:22:46+05:30 IST

కాసేపుంటే పెళ్లి జరుగుతుందనగా.. సినిమా తరహాలో ఓ వరుడు అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మాట విని పెళ్లికూతురుతో పాటూ అంతా షాక్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా పెళ్లికొడుకు మాత్రం..

పెళ్లి జరగాల్సిన టైమ్‌లో వరుడి మాటలకు అంతా షాక్.. ఎంత చెప్పినా వినలేదని వధువు బంధువులంతా కలిసి..

కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. సమయం, సందర్భం లేకుండా నోరు జారి.. చివరికి అబాసుపాలవుతూ ఉంటారు. కాసేపుంటే పెళ్లి జరుగుతుందనగా.. సినిమా తరహాలో ఓ వరుడు అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మాట విని పెళ్లికూతురుతో పాటూ అంతా షాక్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా పెళ్లికొడుకు మాత్రం ససేమిరా అన్నాడు. చెప్పి చెప్పి విసిగిపోయిన వధువు బంధువులంతా చివరకు ఏం చేశారంటే..


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ మండపంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. వధూవరుల బంధువులు, స్నేహితులతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. భోజనాలు తిన్న బంధవులంతా తాళి కట్టే సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో వరుడు రివర్స్ అయ్యాడు. తనకు మరో రూ.10లక్షల కట్నం ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సిల్ అంటూ షాక్ ఇచ్చాడు. ఈ మాటలకు వధువుతో పాటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులంతా ఖంగుతిన్నారు. వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి బతిమాలుకున్నారు.

భర్తతో గొడవపడ్డ భార్య.. ఆ కోపమంతా కూతురిపై చూపించి.. చివరికి ఆమె చేసిన పనేంటో తెలుసా..


ఇప్పటికే రూ.3లక్షల నగదు, రూ.1లక్ష విలువైన డైమండ్ రింగ్‌ను కట్నంగా ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటిదాకా వచ్చి, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అంటే తమ పరిస్థితి ఏంకావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి జరగనివ్వండి.. తర్వాత మాట్లాడుకుందాం అంటూ నచ్చజెప్పారు. అయినా వరుడు మాత్రం ససేమిరా అనడంతో పెళ్లికూతురు బంధువులకు కోపం నశాలానికి అంటింది. ముందూవెనుకా చూడకుండా పెళ్లికొడుకుని చితకబాదారు. చివరకు పోలీసులు ఎంటరయ్యేదాకా వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ గేదెను చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. తాబేలుకు ఆ గేదె ఎలా సాయం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..Updated Date - 2021-12-19T03:22:46+05:30 IST