లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌కు బెంగాలీవాలా స్వీట్ ఐడియా... తెగ న‌వ్వుతున్న నెటిజ‌న్లు

ABN , First Publish Date - 2021-05-18T15:43:46+05:30 IST

కరోనా క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను...

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌కు బెంగాలీవాలా స్వీట్ ఐడియా... తెగ న‌వ్వుతున్న నెటిజ‌న్లు

కోల్‌క‌తా: కరోనా క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి. అయితే కొంత‌మంది విచిత్రమైన కార‌ణాలు చూపిస్తూ లాక్‌డౌన్‌లో బ‌య‌ట తిరిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటువంటి ఉదంతాల‌కు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా ప‌శ్చిమ బెంగాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఒక‌ వ్యక్తి లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వీట్లు కొనుగోలు చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ఇది నెటిజ‌న్ల‌కు తెగ న‌వ్వు తెప్పిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ మిఠాయి దుకాణాలు కొద్ది స‌మ‌యం పాటు తెరిచేందుకు అనుమ‌తినిచ్చారు. 


దీనిని సాకుగా తీసుకున్న ఒక యువ‌కుడు... ఎక్కడికి వెళుతున్నావ‌ని అడిగిన‌ పోలీసుకు... తన మెడలో వేలాడుతున్న ప్ల‌కార్డు చూపించాడు. దానిపై "నేను స్వీట్లు కొనుగోలు చేయ‌బోతున్నాను" అని రాసివుంది. ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన‌ ఒక యూజర్ ఇలా రాశాడు...కోల్‌క‌తాకు చెందిన నా స్నేహితుడిని చూడండి... అతను ఇ-పాస్ మాదిరిగా ప్లకార్డు మెడ‌లో వేసుకుని తిరుగుతున్నాడ‌ని రాశాడు.ఈ వీడియో చూసిన ఒక యూజ‌ర్‌... ఈ ప‌ని బెంగాలీలు మాత్రమే చేయగలరని కామెంట్ రాశాడు.

Updated Date - 2021-05-18T15:43:46+05:30 IST