Vamika 6 Months: తండ్రి విరాట్ కొహ్లీ ఒడిలో వమిక అల్లరి!

ABN , First Publish Date - 2021-07-12T15:30:41+05:30 IST

బాలీవుడ్ నటి అనుష్కా శర్మ, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్...

Vamika 6 Months: తండ్రి విరాట్ కొహ్లీ ఒడిలో వమిక అల్లరి!

బాలీవుడ్ నటి అనుష్కా శర్మ, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీల కుమార్తెకు ఆరు నెలలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అనుష్క తమ కుమార్తె వమికకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వమికతో విరాట్ ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న దృశ్యం ఆ ఫొటోలలో కనిపిస్తుంది. ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వమికకు ఆరు నెలలు నిండిన సందర్భంగా కోహ్లీ దంపతులు కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను షేర్ చేసిన అనుష్క... మా పాప చిరునవ్వు మా ప్రపంచాన్నే మార్చివేసింది... అని రాశారు. 

Updated Date - 2021-07-12T15:30:41+05:30 IST