ఛీ.. ఛీ.. కూరగాయలు విక్రయించేవారు అలా చేస్తారా!.. వైరల్ వీడియా

ABN , First Publish Date - 2021-10-28T15:19:49+05:30 IST

సోషల్ మీడియా పుణ్యమా అని మనం ప్రతి రోజూ ప్రపంచంలో జరిగే చిత్ర.. విచిత్రమైన సంఘటనలు చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఇలా కూడా జరుగుతుందా! అనే ఆశ్చర్యకర వీడియోలు ఇందులో దర్శనమిస్తున్నాయి. అలాంటి వీడియోలలో ఒకటి ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక కూరగాయలు విక్రయించే వ్యక్తి చేసే పని మీరు గనుక చూస్తే ఆసహ్యం కలుగక మానదు...

ఛీ.. ఛీ.. కూరగాయలు విక్రయించేవారు అలా చేస్తారా!.. వైరల్ వీడియా

సోషల్ మీడియా పుణ్యమా అని మనం ప్రతి రోజూ ప్రపంచంలో జరిగే చిత్ర.. విచిత్రమైన సంఘటనలు చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఇలా కూడా జరుగుతుందా! అనే ఆశ్చర్యకర వీడియోలు ఇందులో దర్శనమిస్తున్నాయి. అలాంటి వీడియోలలో ఒకటి ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక కూరగాయలు విక్రయించే వ్యక్తి చేసే పని మీరు గనుక చూస్తే ఆసహ్యం కలుగక మానదు.


అసలు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన సుధీర్ ట్విట్టర్‌లో ఒక ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సుధీర్ ఒక రోజు  తెల్లవారుఝామున బయటికి వెళ్లాడు. అక్కడ ఒక కూరగాయలు విక్రయించే వ్యక్తి చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి తన వద్ద ఉన్న ఆకుకూరలను పక్కనే ఉన్న మురికినీటిలో ముంచి కడిగి మళ్లీ వాటిని విక్రయించేందుకు అమర్చి పెడుతున్నాడు. ఇది చూసిన సుధీర్.. అలా చేయకు.. అని ఎంత చెప్పినా ఆ కూరగాయల విక్రయదారుడు వినిపించుకోలేదు. మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నాడు.


దీంతో సుధీర్ ఆ కూరగాయల విక్రేత చేస్తున్న చెత్త పనిని వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టాడు. భోపాల్ కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియోని లక్షల మంది వీక్షించారు. దీంతో జిల్లా కలెక్టర్.. వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పోలీసు వారికి ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఆ వ్యక్తిపై ఫిర్యారు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


అతని ఆచూకీ తెలుసుకొని.. అతని ఇంటికి వెళ్లగా.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.Updated Date - 2021-10-28T15:19:49+05:30 IST