ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మహిళ.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవీ..!

ABN , First Publish Date - 2021-12-10T22:48:18+05:30 IST

పిల్లలను సక్రమంగా పెంచి పెద్ద చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.

ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మహిళ.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవీ..!

పిల్లలను సక్రమంగా పెంచి పెద్ద చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. పిల్లలను అర్థం చేసుకుని వాళ్లని సన్మార్గంలో నడిపించాలంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి. పిల్లలు చేసే అల్లరి పనుల వల్ల అసహనానికి గురై వారిని దండించే, తిట్టే తల్లిదండ్రులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే ఓ మహిళ కోపంగా ఉన్న తన ఐదేళ్ల కొడుకుతో మాట్లాడిన తీరు నెటిజన్లను మెప్పిస్తోంది. ఆమె తన కొడుకుతో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. దానిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 


కోపంగా ఉన్న కొడుకు ముందు మోకాళ్ల మీద కూర్చుని ఆమె మాట్లాడింది. గొంతు పెంచి మాట్లాడడం కాకుండా చాలా శాంతంగా మాట్లాడింది. `ఐ లవ్యూ. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? నిన్ను నేను ఇంతలా ప్రేమిస్తున్నా` అంటూ రెండు చేతులూ చాపి చూపించింది. `నువ్వు ఎంత కోపంగా ఉన్నావో నాకు అర్థమైంది. నువ్వు శాంతంగా మారాలని కోరుకుంటున్నా. కోపం తెచ్చుకోవడం తప్పేం కాదు. అయితే దానిని త్వరగా వదుల్చుకోవాలి. మన శరీరాన్ని, మనసును ఉల్లాసంగా మార్చుకోవడానికి మరో మార్గం అన్వేషించాలి` అంటూ ఆ మహిళ తన కొడుకుతో మాట్లాడింది. 


వీడియో చివర్లో ఆ కొడుకు తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యం తన ఇంటి తలుపులకు అమర్చి ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయినట్టు గమనించిన తల్లి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఐదేళ్ల కొడుకుతో ఆ తల్లి మాట్లాడిన తీరు నెటిజన్లను మెప్పిస్తోంది. ఆ వీడియో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-12-10T22:48:18+05:30 IST