పొయ్యి మీదే స్నానం.. ఈ బుడ్డోడి అతి తెలివి చూస్తే.. అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2021-12-25T23:45:11+05:30 IST

మనం ఇప్పుడు చెప్పుకోబోయే బుడ్డోడు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నట్టున్నాడు. అతి తెలివి ప్రదర్శిస్తూ ఆ బాలుడు స్నానం చేసే విధాన్నాన్ని చూస్తే ముక్కున వేలేసుకుంటారు. .

పొయ్యి మీదే స్నానం.. ఈ బుడ్డోడి అతి తెలివి చూస్తే.. అవాక్కవుతారు..

కొందరు పిల్లలు స్నానం చేయాలంటేనే చాలా బద్ధకిస్తారు. దీంతో పిల్లలను సిద్ధం చేసి స్కూల్‌కి పంపేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే బుడ్డోడు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నట్టున్నాడు. అతి తెలివి ప్రదర్శిస్తూ ఆ బాలుడు స్నానం చేసే విధాన్నాన్ని చూస్తే ముక్కున వేలేసుకుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది...


పొయ్యి మీద నీరు వేడి చేసి, బకెట్‌లోకి తీసుకోవడం.. ఇదంతా ఎందుకనుకున్నాడో ఏమోగానీ ఈ బుడ్డోడు మాత్రం చాలా వినూత్నంగా ఆలోచించాడు. పొయ్యి మీద వేడవుతున్న నీటిలో డైరెక్ట్‌గా కూర్చుంటే పోలా.. అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. పెద్ద బేసిన్‌లో నీరు పోసి, వేడి చేశాడు. కింద మంట మండుతుండగానే.. బేసిన్‌లో కూర్చుని స్నానం చేయడం ప్రారంభించాడు. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బుడ్డోడి అతి తెలివికి నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. జాగ్రత్త బాబూ.. బేసిన్ నుంచి కిందపడితే ప్రమాదం జరగొచ్చు అని కొందరు జాగ్రత్తలు చెబుతున్నారు.

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు.. తన ఇంటి విలువ రూ.3.6కోట్లు.. ఎలా సాధ్యమైందో తెలుసా..

Updated Date - 2021-12-25T23:45:11+05:30 IST