పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. దొంగచాటుగా ఆస్పత్రికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-07T12:55:28+05:30 IST

తమిళనాడులో ఒక మహిళ దారుణానికి పాల్పడింది. పెళ్లికాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. ఇంతకీ ఆమె చేసిందంటే..

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. దొంగచాటుగా ఆస్పత్రికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..

తమిళనాడులో ఒక మహిళ దారుణానికి పాల్పడింది. పెళ్లికాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. ఇంతకీ ఆమె చేసిందంటే..

తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయు వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారశుద్ధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్‌రూంలో క్లీనింగ్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ టాయ్‌లెట్ ఫ్లష్ ట్యాంకు సరిగా పనిచేయకపోయడంతో అతను దానిని తెరిచి చూడగా అందులో ఒక పసిబిడ్డ శవం కనిపించింది. దీంతో అతడు ఆస్పత్రి యాజమాన్యానికి ఈ విషయం తెలియజేశాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఆస్పత్రిలో అసలు మెటర్నిటి వార్డు లేదని, అందువల్ల ఆ శిశువు అక్కడ జన్మించే అవకాశం లేదని ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. దీంతో పోలీసులు సీసీటీవి వీడియోలను పరిశీలించి ఒక యువతిని అరెస్టు చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని(23) అనే యువతి పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందనే భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు నిర్ణయించుకుని.. ఆమె దెగ్గరలోని తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ దొంగచాటుగా బాత్‌రూంకి వెళ్లి టాయ్‌లెట్ ఫ్లష్ ట్యాంకులో ఆ పని బిడ్డను పెట్టేసి దానిని ట్యాంకును మూసి వేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది. 

Updated Date - 2021-12-07T12:55:28+05:30 IST