35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలవడమే.. ఆ బాలిక తప్పయింది.. చేతులు కట్టేసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

ABN , First Publish Date - 2021-12-26T01:39:18+05:30 IST

18ఏళ్ల బాలిక 35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలిచింది. ఇందులో ఏం తప్పుంది.. అని ఎవరైనా అంటారు. కానీ అలా పిలవడం.. అతనికి నచ్చలేదట. బాలిక చేతులు కట్టేసి.. అతడు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలవడమే.. ఆ బాలిక తప్పయింది.. చేతులు కట్టేసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

కొందరి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. చిన్నచిన్న అంశాలను కూడా బూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ఒక్కోసారి సైకోల్లా మారి నానా రచ్చ చేస్తుంటారు. తీరా కారణాలు విశ్లేషిస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో జరిగింది. 18ఏళ్ల బాలిక 35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలిచింది. ఇందులో ఏం తప్పుంది.. అని ఎవరైనా అంటారు. కానీ అలా పిలవడం.. అతనికి నచ్చలేదట. బాలిక చేతులు కట్టేసి.. అతడు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..


ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని సితార్‌గంజ్ పట్టణంలో మోహిత్‌కుమార్ అనే వ్యక్తి క్రీడా వస్తువులకు సంబంధించిన దుకాణాన్ని నడుపుతున్నాడు. డిసెంబర్ 19న 18ఏళ్ల ఓ బాలిక.. అతడి దుకాణంలో బ్యాడ్మింటన్ రాకెట్‌ను కొనుగోలు చేసింది. అయితే కొన్ని రోజులు వాడగానే దానికి సంబంధించిన తీగలు తెగిపోయాయి. దీంతో ఆమె దాన్ని మార్చుకోవడానికి మంగళవారం మళ్లీ దుకాణానికి వచ్చింది. ‘‘అంకుల్.. బ్యాడ్మింటన్ రాకెట్ సరిగా లేదు.. ఇంకోటి ఇవ్వండి’’.. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అంకుల్ అని పిలవడం ఆ వ్యక్తికి నచ్చలేదట. నన్ను అంకుల్ అని పిలుస్తావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..


ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బాలికను తాళ్లతో కట్టేసి, చితకబాదాడు. సారీ.. సారీ.. అని అంటున్నా, కనికరం చూపకుండా దాడి చేయడం మొదలెట్టాడు. ఈ దాడిలో బాలిక తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఈ దాడినంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. సుమోటోగా తీసుకున్న పోలీసులు.. దుకాణ యజమానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంకుల్ అన్నందుకు బాలికపై క్రూరంగా ప్రవర్తించిన దుకాణదారుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

Updated Date - 2021-12-26T01:39:18+05:30 IST