మద్యానికి బానిసైన భర్త.. అద్దె కట్టలేక ఇంటి ఓనర్‌తో.. భార్యను కలపాలని ప్రయత్నం.. చివరికి..

ABN , First Publish Date - 2021-11-28T23:17:28+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి వచ్చాడు. దీంతో భార్యను ఇంటి ఓనర్‌తో కలపాలని ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే..

మద్యానికి బానిసైన భర్త.. అద్దె కట్టలేక ఇంటి ఓనర్‌తో.. భార్యను కలపాలని ప్రయత్నం.. చివరికి..
ప్రతీకాత్మక చిత్రం

భార్య మీద చీటికీమాటికీ అనుమానం పెంచుకుని కొందరు వేధిస్తుంటారు. దీంతో ఆ కుటుంబం చివరికి సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. ఇంకొందరు భార్యను ప్రేమగా చూసుకుంటూ, జీవితాంతం అన్యోన్యంగా జీవిస్తుంటారు. మరికొందరు కుటుంబ బాధ్యతలను భార్యలకు అప్పగించి, అల్లరిచిల్లరిగా తిరుగుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి వచ్చాడు. దీంతో భార్యను ఇంటి ఓనర్‌తో కలపాలని ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగేది. అయితే రానురాను భర్త.. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా.. నిత్యం తాగడమే పనిగా పెట్టుకునేవాడు. దీంతో చేసేదేమీ లేక అతడి భార్యే.. కుటుంబ బాధ్యతలు చూసుకునేది. అయితే ఆమె సంపాదన అంతంతమాత్రమే కావడంతో ఇబ్బందులు పడేవారు. భర్త మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ఇంట్లో భార్య దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్లి మందు తాగేవాడు. చివరికి ఇంటి అద్దె కట్టడం కూడా గగనంగా మారింది.


మరోవైపు అద్దె కట్టమని ఇంటి ఓనర్ ఒత్తిడి చేస్తుండేవాడు. దీంతో ఓ రోజు ఆ వ్యక్తి భార్యతో ఇలా అన్నాడు. ఇంటి ఓనర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. అద్దె కట్టే పనుండదని చెప్పాడు. ఏ భర్త అనకూడని మాట అనడంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ప్రాణం పోయినా అలాంటి పనులు చేయనంటూ తెగేసి చెప్పింది. అయినా భర్త మాత్రం రోజూ ఆ పని చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. ఒక్కోసారి మందు తాగొచ్చి భార్యను తీవ్రంగా కొట్టేవాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-11-28T23:17:28+05:30 IST