వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా..? ఏకంగా వాహనాన్నే..!

ABN , First Publish Date - 2022-01-01T03:02:08+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో పులికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పులి చేసిన పనిని చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.

వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా..? ఏకంగా వాహనాన్నే..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో పులికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పులి చేసిన పనిని చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. నెటిజన్లు అంతలా ఆశ్చర్యపడేలా పడేలా ఆ పులి ఏం చేసిందనేగా మీ సందేహం. మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి.తాజాగా కొందరు టూరిస్ట్‌లు బన్నేర్‌ఘట్ నేషనల్ పార్కును సందర్శించేందుకు వెళ్లారు. జైలో వాహనంలో పార్కులో తిరుగుతూ.. అక్కడ కనిపించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పులుల గుంపును చూసి తమ జైలో వాహనాన్ని పక్కన పార్కు చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారి వాహనం వెనకపై నుంచి ఓ పులి వచ్చింది. గట్టిగా గాండ్రిస్తూ.. ఆ వాహనానికి ఉన్న బంపర్‌ను నోటితో బలంగా పట్టుకుని.. కొన్ని మీటర్ల వరకూ వెనకకు లాగింది. దీంతో వాహనంలో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరో వాహనంలో ఉన్న పర్యాటకుడు ఆ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర  ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-01-01T03:02:08+05:30 IST