ఈ బామ్మలు చేస్తున్న పనులు చూస్తే ఉత్సాహం వస్తుంది.. తాము కూడా అలా చేస్తే బాగుంటుందని అనుకుంటారు!

ABN , First Publish Date - 2021-11-18T13:49:33+05:30 IST

ఈ బామ్మలు చేస్తున్న పనులు చూస్తే ఉత్సాహం వస్తుంది.. తాము కూడా అలా చేస్తే బాగుంటుందని అనుకుంటారు!

ఈ బామ్మలు చేస్తున్న పనులు చూస్తే ఉత్సాహం వస్తుంది.. తాము కూడా అలా చేస్తే బాగుంటుందని అనుకుంటారు!
జోన్ డిబేంక్, భాగీరథి అమ్మ, కార్తియాని అమ్మ

చదువుకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని అందరూ చెబుతుంటారు. అయితే దీనిని కొందరే రుజువు చేస్తారు. చిన్నప్పుడెప్పుడో చదవు మానేసిన ఈ మగువలు.. తమ బాధ్యతలన్నీ తీరిపోయాక వందేళ్ల వయసులో బామ్మలుగా మారిన అనంతరం తిరిగి అక్షరాలు దిద్ది, తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. వారి కహానీని ఇప్పుడు చూద్దాం.


భాగీరథి అమ్మ

2020వ సంవత్సరంలో, కేరళకు చెందిన భాగీరథి అమ్మ 4వ తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అప్పటికి ఆమె వయసు 105 ఏళ్లు. 2019లో కొల్లాంలో రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహించిన పరీక్షలకు అమ్మ హాజరయ్యారు. 2020లో పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అమ్మ పాసయ్యారు. ఈ బామ్మ 275 మార్కులకు 205 మార్కులు సాధించారు. అంతేకాదు గణితం సబ్జెక్టులో నూరుశాతం మార్కులు సాధించారు. వయస్సును అధిగమించి తమ కలలను నెరవేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యను ఆశ్రయించిన భాగీరథి అమ్మ లాంటి వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో భాగీరథి అమ్మ చదువు దూరమయ్యారు. అప్పటికి ఆమె వయసు కేవలం 9 సంవత్సరాలు. ఇంటిలో ఆమెనే పెద్ద దిక్కుకావడంతో ఇంటిలోని అందరి బాధ్యత ఆమెపై పడింది. భాగీరథికి చిన్నతనంలోనే వివాహమయ్యింది. ఆమె భర్త మరణించాడు. దీంతో ఆరుగురు పిల్లల బాధ్యత ఆమెపైనే పడింది. ఈ భాధ్యతలన్నీ నెరవేర్చాక, వందేళ్ల వయసు దాటాక మళ్లీ కలం పట్టుకుని పరీక్షలు రాశారు. పర్యావరణం, గణితం, మలయాళం మూడు ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఈ పరీక్షలో బామ్మ 205 మార్కులు సాధించారు. 2021 జూలై 23న ఆమె తుది శ్వాస విడిచారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భాగీరథి అమ్మ గురించి ప్రస్తావించారు.


కార్తియాని అమ్మ

భాగీరథి అమ్మలానే 96 ఏళ్ల కార్తియాని అమ్మ కూడా 2018లో కేరళ ప్రభుత్వం నిర్వహించిన అక్షరాస్యత మిషన్ 'అక్షర లక్ష్యం'లో పాల్గొని 100కి 98 మార్కులు సాధించారు. ఈ వయసులో ఈ ఘనత సాధించి వందలాది మందికి ఆదర్శంగా నిలిచారు కార్తియాని అమ్మ.

జోన్ డిబేంక్

కెనడాలో నివసిస్తున్న జోన్ డిబేంక్ 2018 సంవత్సరంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. తన 13 సంవత్సరాల వయస్సులో ఆమె చదువు మానేసి ఇంటి పనుల్లో సహాయం చేయడం ప్రారంభించారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించారు. 16 ఏళ్ల వయసులో జోన్ ఒక సైనికుడిని వివాహం చేసుకున్నారు. చదువు పూర్తి చేయలేకపోయినందుకు పశ్చాత్తాపపడుతూ జోన్ అప్పుడప్పుడు ఏడ్చేదని ఆమె పిల్లలు తెలిపారు. ఎట్టకేలకు పిల్లల సహకారంతో తన 92 ఏళ్ల వయసులో ఈ బామ్మ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది లేచి నిలబడి చప్పట్లతో బామ్మకు స్వాగతం పలికినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated Date - 2021-11-18T13:49:33+05:30 IST