ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా..

ABN , First Publish Date - 2021-12-30T03:27:23+05:30 IST

కేరళ రాజధాని తిరువనంతపురంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే యువతి తండ్రి గమనించి వెనుకే వెళ్లాడు. తర్వాత జరిగిన ఘటన..

ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేయసి కోసం ప్రియుడు ఎంతకైనా తెగిస్తుంటాడు. సినిమాల్లో చూపినట్లుగా నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రేమకథలు.. చివరకు విషాదాంతం అవుతుంటాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే యువతి తండ్రి గమనించి వెనుకే వెళ్లాడు. తర్వాత జరిగిన ఘటన.. స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


తిరువంతనపురంలో లాలన్ అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఈమె ఇదే ప్రాంతానికి చెందిన జార్జ్ అనే యువడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. అయితే మంగళవారం అర్ధరాత్రి యువకుడు.. తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ఆమె తండ్రి గమనించాడు. దొంగేమో అనుకుని వెనుకే వెళ్లి.. ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లాలన్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. అనుకోని ఈ ఘటనతో స్థానికంగా విషాధ చాయలు అలుముకున్నాయి.

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..

Updated Date - 2021-12-30T03:27:23+05:30 IST