తన ప్రమేయం లేకుండా పని మొదలెట్టారని మహిళ ఆగ్రహం.. మొత్తానికి యువకులకు గాలిలో చెమటలు పట్టించిందిగా..!

ABN , First Publish Date - 2021-10-29T01:44:47+05:30 IST

ఒక్కోసారి ఇగో.. మనిషిని ఎందాకైనా తీసుకెళ్తుంది. తమ ఇగో చల్లారే వరకూ కొందరు ఎంతకైనా తెగిస్తారు. థాయ్‌లాండ్‌లో ఓ మహిళ కూడా ఇలాగే చేసింది. తన ప్రమేయం లేకుండా, తన ఇంట్లో ఇద్దరు యువకులు చేసిన పని.. ఆమెకు నచ్చలేదు. విషయం తెలుసుకుని

తన ప్రమేయం లేకుండా పని మొదలెట్టారని మహిళ ఆగ్రహం.. మొత్తానికి యువకులకు గాలిలో చెమటలు పట్టించిందిగా..!

ఒక్కోసారి ఇగో.. మనిషిని ఎందాకైనా తీసుకెళ్తుంది. తమ ఇగో చల్లారే వరకూ కొందరు ఎంతకైనా తెగిస్తారు. థాయ్‌లాండ్‌లో ఓ మహిళ కూడా ఇలాగే చేసింది. తన ప్రమేయం లేకుండా, తన ఇంట్లో ఇద్దరు యువకులు చేసిన పని.. ఆమెకు నచ్చలేదు. విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైంది. చివరకు ఆ యువకులకు గాలిలోనూ చెమటలు పట్టేలా చేసింది. ఆమె కోపం చల్లారే వరకూ వారిని వదల్లేదు. వివరాల్లోకి వెళితే..


ఉత్తర బ్యాంకాక్‌ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో 26వ అంతస్తులో మహిళ నివాసం ఉంటోంది. ఇటీవల తమ అపార్ట్‌మెంట్‌లో మరమ్మతు పనులు చేపడుతున్నారు. అయితే మహిళకు సంబంధించిన ఇంటి బయట ఇద్దరు యువకులు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ.. అక్కడికి చేరుకుని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి తీసుకోకుండా పనులు ఎలా చేస్తారంటూ మండిపడింది. తాడు సాయంతో పెయింట్ వేస్తున్న వారు.. కిందకు దిగకుండా ఆపేసింది. వారికి సాయంగా ఉన్న మరో తాడును కట్ చేసింది. దీంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది.


ఆ మహిళ ఉన్నట్టుండి ఇలా కోపం తెచ్చుకుంటుందని ఊహించని పెయింటర్లు.. వణికిపోయారు. వదిలేయమని ఎంత వేడుకున్నా మహిళ వినిపించుకోలేదు. చివరకు విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది.. అక్కడికి చేరుకున్నారు. మహిళకు సర్దిచెప్పి ఆ యువకులను కిందకు దింపేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆ మహిళకు మరీ అంత కోపం ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు.

Updated Date - 2021-10-29T01:44:47+05:30 IST