గుడి ముందు ఏడుస్తున్న మూడేళ్ల పాప.. తల్లి కోసం వెతుకుతోంటే పొదల్లో కనిపించిందో షాకింగ్ దృశ్యం

ABN , First Publish Date - 2021-07-08T19:00:41+05:30 IST

అక్కడికి కొంత దూరంలో ఉన్న పొదల్లో వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది.

గుడి ముందు ఏడుస్తున్న మూడేళ్ల పాప.. తల్లి కోసం వెతుకుతోంటే పొదల్లో కనిపించిందో షాకింగ్ దృశ్యం

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి. ఒంటరిగా గుళ్లో కూర్చుని ఏడుస్తోంది. ఆ పాపను ఒంటరిగా చూసిన స్థానికులు తల్లి గురించి చుట్టుపక్కలంతా వెతికారు. అక్కడికి కొంత దూరంలో ఉన్న పొదల్లో వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఒళ్లంతా గాయాలతో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆమెను చూసి `అమ్మా` అంటూ మూడేళ్ల చిన్నారి ఏడవడంతో వారిద్దరూ తల్లీకూతుళ్లని తెలిసింది. ఆ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో ఈ ఘటన జరిగింది. 


రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు మరికొంత దూరంలో పార్క్ చేసి ఉన్న బొలేరో వాహానాన్ని గుర్తించారు. అందులో చనిపోయిన మహిళకు సంబంధించిన గాజులు, బట్టలు ఉన్నాయి. ఆ మూడేళ్ల పాపను అడగ్గా తన తండ్రే తల్లిని కొట్టినట్టు చెప్పింది. అంతకు మించిన వివరాలేవీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప తండ్రే తల్లిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. భార్యను చంపాలనే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి వారిని ఇంతదూరం తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ వాహనం నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2021-07-08T19:00:41+05:30 IST