భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..

ABN , First Publish Date - 2021-12-25T22:28:16+05:30 IST

కర్నాటకలో ఓ వ్యక్తి.. భార్య పుట్టింటికి వెళ్లగానే, తన సరదాలను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన స్నేహితులను ఇంటికి పిలిచి, పార్టీ ఇచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలతో ...

భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు భార్యపై గౌరవంతోనో, భయంతోనో.. తమకున్న ఇష్టాయిష్టాలను అనచిపెట్టుకుని ఉంటారు. కొందరికి మందుతాగడం, మరికొందరికి జూదం ఆడడం వంటి అలవాట్లు ఉన్నా.. వాటిని అదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే భార్య లేని సమయంలో అలాంటి వారు తమకు ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కర్నాటకలో ఓ వ్యక్తి.. భార్య పుట్టింటికి వెళ్లగానే, తన సరదాలను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన స్నేహితులను ఇంటికి పిలిచి, పార్టీ ఇచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలతో అంతా షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళితే..


కర్నాటక శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా రిప్పన్‌పేట సమీపంలోని గరతికెరె గ్రామంలో సతీశ్(32) కుటుంబం నివాసం ఉంటోంది. భార్యపై గౌరవమో, భయమో తెలీదుగానీ తన అలవాట్లను బయటపెట్టేవాడు కాడు. కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేకున్నా.. అతడి చెడు అలవాట్ల కారణంగానే అనుకోని ఘటన చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయాడు. గత బుధవారం సతీశ్ భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..


తన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి, ఇంటికి రమ్మని పిలిచాడు. బుధవారం రాత్రి ముగ్గురూ కలిసి సతీశ్ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్‌గా మద్యం తీసుకోవడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. వారికే అర్థం కాలేదు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు స్నేహితులు.. సతీశ్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశారు. మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..

Updated Date - 2021-12-25T22:28:16+05:30 IST