బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..

ABN , First Publish Date - 2021-12-17T01:09:39+05:30 IST

అమెరికాలో ఓ ప్లంబర్‌ను అదృష్టం వరించింది. బాత్రూమ్‌లో మరమ్మతు పనుల్లో ఉన్న అతడికి గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం కలిగింది. అనంతరం బద్దలు కొట్టి చూసి షాక్ అయ్యాడు...

బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..

వెతక్కబోయే తీగ.. కాలికి తగిలినట్లు... కొన్నిసార్లు చాలామంది ఎలాంటి కష్టం లేకుండా.. కోటీశ్వరులు అయిపోతుంటారు. మరికొందరు కోటీశ్వరులు.. దురదృష్టం కొద్దీ చూస్తుండగానే కటిక పేదవారు అయిపోతుంటారు. అమెరికాలో ఓ ప్లంబర్‌ను అదృష్టం వరించింది. బాత్రూమ్‌లో మరమ్మతు పనుల్లో ఉన్న అతడికి గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం కలిగింది. అనంతరం బద్దలు కొట్టి చూసి షాక్ అయ్యాడు...


అమెరికా టెక్సాస్‌కు చెందిన జస్టిన్ కౌలీ అనే ప్లంబర్ వృత్తిరీత్యా ప్లంబర్. స్థానికంగా ఉండే ఓ చర్చి బాత్రూమ్‌లో మరమ్మతు పనులు ఉంటే వెళ్లాడు. అక్కడ పనులు చేస్తున్న క్రమంలో ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో కూడిన గోడలో ఏదో ఉన్నట్లు అతడికి అనుమానం కలిగింది. తర్వాత గోడను బద్దలుకొట్టి చూసి షాక్ అయ్యాడు. ఆ గోడలో రూ.4.5కోట్లు బయటపడ్డాయి. అయితే ఆ డబ్బులను పోలీసుకు అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.

రూ.7499 విలువైన Geyser ను అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే.. పార్శిల్లో వచ్చిన వాటిని చూసి అవాక్కైన కస్టమర్


2014లో చర్చి నుంచి నగదు చోరీ అయిందని తర్వాత తెలిసింది. అప్పట్లో నగదు రికవరీ కోసం దర్యాప్తు సంస్థలు రూ.3 లక్షల రివార్డును కూడా ప్రకటించాయట. అప్పటి నుంచీ నగదు ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు ప్లంబర్ ద్వారా నగదు బయటపడడంతో చర్చి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ప్లంబర్ నిజాయితీని మెచ్చుకున్న వారు.. అతడికి రూ.15 లక్షలను బహుమతిగా అందించారు.

నా భర్త నన్ను తిట్టాడు.. అంటూ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిందో భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2021-12-17T01:09:39+05:30 IST