మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..

ABN , First Publish Date - 2021-12-31T00:14:11+05:30 IST

పాకిస్తాన్‌లోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాధారణంగా వరుడు గుర్రం మీదనో, లేక వాహనం మీదనో ఎంట్రీ ఇస్తుంటాడు. కానీ ఇక్కడ అలాగే అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..

పెళ్లి అనే మధుర ఘట్టం.. జీవితాంతం గుర్తుండాలనే ఉద్దేశంతో చాలా మంది వినూత్నంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లికొడుకులే ముందుంటారు. ఏదోటి చేసి.. తమ పెళ్లి గురించి అంతా చర్చించుకోవాలని తపనపడుతుంటారు. అయితే ఓ పాకిస్తానీ పెళ్లికూతురు మాత్రం.. మగవారికి తాను ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా.. అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం నెట్టింట.. హాట్ టాపిక్ అయింది.


పాకిస్తాన్‌లోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాధారణంగా వరుడు గుర్రం మీదనో, లేక వాహనం మీదనో ఎంట్రీ ఇస్తుంటాడు. కానీ ఇక్కడ అలాగే అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వినూత్నంగా గుర్రంపై వధువు మండపంలోకి వచ్చింది. అంతేకాకుండా పక్కన కొంతమంది కత్తులతో ఆమెకు స్వాగం పలకడం చూడవచ్చు. టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ లోని ఓ సన్నివేశంలో వధువు ఇలాగే చేస్తుందట. ఆ సన్నివేశం ఈ పాకిస్తానీ వధువుకు నచ్చడంతో అలాగే చేసిందట. పాకిస్తానీ సంప్రదాయం ప్రకారం ముఖానికి దుపట్టా కప్పుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఈ యువతి మాత్రం సరికొత్తగా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!Updated Date - 2021-12-31T00:14:11+05:30 IST