అప్పటికే 8మంది పిల్లల తండ్రి.. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి.. చివరకు..!

ABN , First Publish Date - 2021-11-10T02:13:15+05:30 IST

జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ వ్యక్తి భార్య, 8మంది పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. రోజూ తనతో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఆమె బంధువులకు

అప్పటికే 8మంది పిల్లల తండ్రి.. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

భార్య, పిల్లలతో జీవితాన్ని హాయిగా గడపాలని అంతా అనుకుంటారు. కానీ కొందరు మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుని.. తాము నాశనమవడంతో పాటూ కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటారు. అప్పటికే 8మంది పిల్లలున్న ఓ వ్యక్తికి పాడుబుద్ధి పుట్టింది. ఓ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత అతడు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ వ్యక్తి భార్య, 8మంది పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. రోజూ తనతో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఆమె బంధువులకు మాయమాటలు చెప్పి.. బాలికను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత మైనర్‌ని ఇంటికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత వేధించడం మొదలెట్టాడు. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేవాడు. దీనికి బాలిక నిరాకరించడంతో శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత కూతుర్ని చూద్దామని వచ్చిన తల్లిదండ్రులకు.. అతడికి అప్పటికే వివాహమైందని తెలుసుకున్నారు. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం బాలిక కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. తర్వాత బాలికను వారి ఇంటికి తీసుకెళ్లారు.


అయితే కొన్ని రోజులకు మళ్లీ బాలిక ఇంటికి వెళ్లిన ఆ వ్యక్తి.. మరోసారి మాయమాటలు చెప్పి బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మరింత చిత్రహింసలకు గురిచేసేవాడు. అతడి వేధింపులు తాళలేక.. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆమెను పట్టుకుని మళ్లీ భర్త వద్దకు తీసుకెళ్లారు. కొన్ని రోజులకు మళ్లీ ఎలాగోలా తప్పించుకుని.. కర్మతాండ్‌కు చేరుకుంది. అక్కడి వారికి తన బాధ చెప్పుకోగా పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-10T02:13:15+05:30 IST