తల్లి అంటే ఈ పిల్ల కోతికి ఎంత ప్రేమో.. వీడియో చూస్తే.. ఈ మాట మీరే అంటారు..

ABN , First Publish Date - 2021-11-22T03:14:54+05:30 IST

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో తల్లి కోతిని.. పిల్ల కోతి ఎంతో ప్రేమతో ముద్దాడుతుంది. తన తల్లి పట్ల ఎంత ప్రేమ ఉందో.. ఈ చిన్న వీడియో చూస్తే తెలుస్తుంది..

తల్లి అంటే ఈ పిల్ల కోతికి ఎంత ప్రేమో.. వీడియో చూస్తే.. ఈ మాట మీరే అంటారు..

నవ మాసాలూ మోసి, కని పెంచిన తల్లిని.. వృద్ధాప్యంలో పరాయి వారిగా చూసే రోజులివి. ఇలాంటి రోజుల్లో తల్లిదండ్రుల పట్ల స్వచ్ఛమైన ప్రేమను చూపించే పిల్లలు చాలా చాలా అరుదు. అందుకే అప్పుడప్పుడూ అంటుంటారు.. మనుషుల కంటే జంతువులు మేలని. ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో తల్లి కోతిని.. పిల్ల కోతి ఎంతో ప్రేమతో ముద్దాడుతుంది. తన తల్లి పట్ల ఎంత ప్రేమ ఉందో.. ఈ చిన్న వీడియో చూస్తే తెలుస్తుంది..


పిల్ల కోతితో కలిసి ఓ తల్లి కోతి చెట్టు మీద ఉంటుంది. అయితే అటూ ఇటూ తిరిగే పిల్ల కోతి.. తల్లి మాట వినకుండా చెట్టు పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తన పిల్లకు ఏమవుతుందో అనే ఆందోళనతో.. వెంటనే దాన్ని మీదకు లాక్కుంటుంది. ఇక్కడే పిల్ల కోతి.. తన తల్లి ప్రేమను గుర్తిస్తుంది. థ్యాంక్స్ మమ్మీ.. అన్నట్లుగా తల్లి కోతికి ఆప్యాయంగా ముద్దు పెడుతుంది. వాటి మధ్య అనురాగం చూస్తే.. చాలా ముచ్చటేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వాటి మధ్య ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.Updated Date - 2021-11-22T03:14:54+05:30 IST