ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..
ABN , First Publish Date - 2021-12-30T23:42:41+05:30 IST
బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి, అరవింద్ దంపతులు. పదేళ్ల పాటు కాపురం సవ్యంగా సాగింది. వీరికి యువిక రెడ్డి, త్రివిద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతడితో విడిపోయి పిల్లలతో కలిసి...

జీవితాంతం కలిసుండాలనే అంతా వివాహం చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు వివిధ కారణాలతో మధ్యలోనే దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు చివరికి విడాకుల వరకూ దారి తీస్తుంటాయి. మళ్లీ వేరొకరిని పెళ్లి చేసుకున్నా.. వారి జీవితం సవ్యంగా సాగుతుందన్న నమ్మకం ఉండదు. బెంగళూరులో ఇలాగే జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. తర్వాత వేరొకరిని వివాహం చేసుకుంది. అయితే అతడితో కూడా సమస్యలు తలెత్తి విడాకులు తీసుకుంది. చివరకు ఆమె జీవితంలోకి ఓ జిమ్ ట్రైనర్ ప్రవేశించాడు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి, అరవింద్ దంపతులు. పదేళ్ల పాటు కాపురం సవ్యంగా సాగింది. వీరికి యువిక రెడ్డి, త్రివిద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతడితో విడిపోయి పిల్లలతో కలిసి ప్రత్యేకంగా ఉంటోంది. కొన్నాళ్లకు సిద్ధిక్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల అనంతరం ఇతడితో కూడా గొడవలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. అయితే ఇటీవల ఆమె జిమ్‌కు వెళ్లే క్రమంలో ట్రైనర్ నవీన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!
అర్చనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన నవీన్.. అర్చన కూతురు యువికకు జిమ్ ట్రైనింగ్ పేరుతో దగ్గరయ్యాడు. అర్చనకు తెలీకుండా ఆమె కూతురితో కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. నవీన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న అర్చనకు.. కూతురుతో సంబంధాన్ని కొనసాగించడం నచ్చలేదు. పలుమార్లు నవీన్‌ను మందలించింది. ఆమె ఫిర్యాదుతో నవంబర్11న నవీన్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి, మందలించారు. తర్వాత కొన్ని రోజులకు యువిక, నవీన్ బయటికి వెళ్లి కాపురం పెట్టారు.
పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..
ఈ విషయం తెలియడంతో తనకు తెలిసిన వారితో నవీన్‌కు ఫోన్ చేయించి బెదిరించింది. దీంతో అర్చనపై నవీన్ పగ పెంచుకున్నాడు. తన స్నేహితుల సహకారంతో ఓ రోజు అర్చనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. హత్య చేశాడు. అర్చన కొడుకు ఫిర్యాదుతో పోలీసులు నవీన్‌ను, అతడికి సహకరించిన స్నేహితులను అరెస్ట్ చేశారు. అర్చనను చంపితే.. ఆస్తి మొత్తం తన సొంతమవుతుందని కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.