ఫోన్లో మాట్లాడుతూనే కోట్లు సంపాదించిన భార్యాభర్తలు.. అదెలా సాధ్యమని అవాక్కవుతున్నారా..? వీళ్ల నిర్వాకమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-09T22:46:27+05:30 IST

ఓ దంపతులు.. కేవలం ఫోన్లు మాట్లాడుతూ కోట్లు సంపాదించారు. ఫోన్లలో మాట్లాడితే కోట్లు వస్తాయా.. అని అవాక్కవుతున్నారా.. వారి గురించి మొత్తం తెలుసుకుంటే నోరెళ్లబెడతారు.

ఫోన్లో మాట్లాడుతూనే కోట్లు సంపాదించిన భార్యాభర్తలు.. అదెలా సాధ్యమని అవాక్కవుతున్నారా..? వీళ్ల నిర్వాకమేంటో తెలిస్తే..

డబ్బు.. మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. కొందరైతే డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక.. కొందరు కష్టపడకుండా, తమ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. అప్పటికి వారి జీవితం బాగున్నా.. అంతిమంగా మాత్రం శిక్ష అనుభవించకతప్పదని తెలుసుకుంటారు. ఇక్కడ ఓ దంపతులు.. కేవలం ఫోన్లు మాట్లాడుతూ కోట్లు సంపాదించారు. ఫోన్లలో మాట్లాడితే కోట్లు వస్తాయా.. అని అవాక్కవుతున్నారా.. వారి గురించి మొత్తం తెలుసుకుంటే నోరెళ్లబెడతారు.


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన యోగేష్ గౌతమ్, సప్నాగౌతమ్ భార్యాభర్తలు. కోట్ల డబ్బులు సంపాదించాలనేది వీరి ఆశయం. అయితే ఏమాత్రం కష్టడకుండా, కాలు కదపకుండా కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచించేవారు. సోషల్ మీడియాలో కొంతమంది నంబర్లను సేకరించి, భార్యతో మాట్లాడించేవాడు. ప్రేమ పేరుతో నమ్మించి.. చివరకు న్యూడ్ కాల్స్ చేసే వరకూ తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో వారి వీడియోలను రికార్డు చేసి, అనంతరం వాటిని సదరు వ్యక్తులకు పంపి బెదిరించేవారు. అయితే పరువు పోతుందని భయపడే వారు.. వారు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవారు. ఇలా చాలా మంది నుంచి డబ్బులను దండుకున్నారు.


ఈ క్రమంలో మరికొంత మంది యువతులను ఉద్యోగం పేరుతో.. వీరి పనిలో భాగస్వాములను చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి భారీగా డబ్బు డిమాండ్ చేశారని.. అప్పటి నుంచి ఇదే పని చేస్తూ పలువురిని మోసం చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా సుమారు రూ.4 కోట్ల వరకు పోగేసినట్లు తెలిసింది. ఇటీవల ఈ గ్యాంగ్ వలపు వలలో చిక్కుకుని రాజ్‌కోట్‌కు చెందిన తుషార్ అనే వ్యక్తి రూ.80 లక్షలు సమర్పించుకున్నాడు. అతడి ఫిర్యాదుతో ఎట్టకేలకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పోర్న్ వీడియోలు, ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్స్, అశ్లీల దృశ్యాల సీడీలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-09T22:46:27+05:30 IST