రాత్రికి రాత్రే ఇంట్లో భార్య మృతి.. భర్తను అనుమానించారు కానీ.. దగ్గర్లోని సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలతో..

ABN , First Publish Date - 2021-12-19T21:44:27+05:30 IST

అది మధ్యప్రదేశ్ పరిధిలోని బలోత్రా నగరంలోని హీరాబాకిధాని అనే ప్రాంతం.. డిసెంబర్ 14న ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్ద జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇంతలో పోలీసు వాహనం అక్కడికి వచ్చింది..

రాత్రికి రాత్రే ఇంట్లో భార్య మృతి.. భర్తను అనుమానించారు కానీ.. దగ్గర్లోని సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలతో..
సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు

అది మధ్యప్రదేశ్ పరిధిలోని బలోత్రా నగరంలోని హీరాబాకిధాని అనే ప్రాంతం.. డిసెంబర్ 14న ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్ద జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇంతలో పోలీసు వాహనం అక్కడికి వచ్చింది. వారు లోపలికి వెళ్లి చూడగా.. ఓ మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. చుట్టు పక్కల వారిని విచారించగా.. ఎవరి నుంచీ సమాధానం రాలేదు. ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని అంతా అనుమానించారు. పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. హత్యకు గల కారణాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌ బలోత్రా పరిధిలోని శివపురిలో శిశుపాల్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. బలోత్రాలోని పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇదిలావుండగా, పనికి వస్తూ.. పోతూ ఉన్న క్రమంలో శిశుపాల్‌కు ఫ్యాక్టరీకి సమీపంలో రాణి అనే మహిళ పరిచయమైంది. ఈమె భర్త జోధ్‌పూర్‌లో పని చేస్తుంటాడు. భర్తతో మనస్పర్థల కారణంగా తన తల్లి, పిల్లలతో కలిసి బలోత్రాలో నివాసం ఉంటోంది. తన భర్తతో జరిగిన గొడవల గురించి శిశుపాల్‌కు చెప్పింది. దీంతో రోజూ ఆమెకు ఓదార్పు మాటలు చెబుతూ దగ్గరయ్యాడు. ఇలా వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

పెళ్లి జరగాల్సిన టైమ్‌లో వరుడి మాటలకు అంతా షాక్.. ఎంత చెప్పినా వినలేదని వధువు బంధువులంతా కలిసి..


పని మీద బల్రోత్రా వచ్చే శిశుపాల్.. అనంతరం రాణితో కలుస్తూ ఉండేవాడు. ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. తనకు తెలీకుండా రాణి మళ్లీ వేరేవారితో అక్రమ సంబంధం పెట్టుకుందని శిశుపాల్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. డిసెంబర్ 13వ తేదీ రాత్రి రాణి ఇంటికి వచ్చిన శిశుపాల్.. మళ్లీ అదే విషయమై గొడవ పడ్డాడు. గొడవ ముదరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వంట గదిలోని దోశ పాన్‌ తీసుకుని రాణి మెడపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

భర్తతో గొడవపడ్డ భార్య.. ఆ కోపమంతా కూతురిపై చూపించి.. చివరికి ఆమె చేసిన పనేంటో తెలుసా..


సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఎవరు చంపారనే విషయంలో మొదట సందేహం ఉండేది. హత్యకు వాడిన వస్తువును స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆ వీడియోలు చూడగానే కేసు కొలిక్కి వచ్చింది. హత్యకు ఐదు గంటల ముందు.. మృతురాలితో మాట్లాడుతున్న శిశుపాల్‌ను పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడు శిశుపాల్ కోసం గాలిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

ఈ గేదెను చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. తాబేలుకు ఆ గేదె ఎలా సాయం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..

Updated Date - 2021-12-19T21:44:27+05:30 IST