పెళ్లిలో సంతోషంగా ఉన్న వరుడు.. ఇంతలో మరదలు వచ్చి చెప్పింది విని షాక్.. ఒక్కసారిగా మారిన సీన్..

ABN , First Publish Date - 2021-10-15T03:24:01+05:30 IST

పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెను.. వరసైన వారు ఆట పట్టించడం అంతే సరదాగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే పెళ్లిలో మరదలు చేసిన పనికి ఆ వరుడు షాక్ తిన్నాడు.

పెళ్లిలో సంతోషంగా ఉన్న వరుడు.. ఇంతలో మరదలు వచ్చి చెప్పింది విని షాక్.. ఒక్కసారిగా మారిన సీన్..

పెళ్లిలో బంధువుల సందడి ఎంతలా ఉంటుందో.. పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెను.. వరసైన వారు ఆట పట్టించడం అంతే సరదాగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే పెళ్లిలో మరదలు చేసిన పనికి ఆ వరుడు షాక్ తిన్నాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వరుడి దగ్గరికి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరదలు.. రూ.21లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వరుడి బంధువులతోనూ గొడవకు దిగింది. చివరగా అసలు విషయం తెలిసి పెళ్లికొచ్చిన బంధువులంతా అవాక్కయ్యారు.


పెళ్లిళ్లలో సంప్రదాయాలు, ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని చోట్ల వింత వింత ఆచారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఓ ఘటన జరిగింది. సాధారణంగా పెళ్లిళ్లలో బావను మరదళ్లు ఆట పట్టిస్తుంటారు. ఈ క్రమంలో వారి వస్తువులను చోరీ చేసి, డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు.


ఓ వరదలు తన బావ చెప్పులను దొంగిలించింది. అవాక్కయిన వరుడు ఎంత అడిగినా తిరిగి ఇవ్వలేదు. ఈ విషయంలో వారి స్నేహితులతోనూ గొడవ పడిన ఆ యువతి.. చివరకు తనకు రూ.21లక్షలు ఇస్తేనే చెప్పులు ఇస్తానని తేల్చి చెప్పేసింది. దీంతో చేసేదిలేక ఆఖరకు మరదలికి రూ.లక్ష సమర్పించుకుని, చెప్పులను విడిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Updated Date - 2021-10-15T03:24:01+05:30 IST