వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొన్నాళ్లకు బ్రేకప్.. అయితే చివరకు ఆమె డిమాండ్ విని ప్రియుడు షాక్..

ABN , First Publish Date - 2021-11-29T01:23:36+05:30 IST

మనం చెప్పుకోబోయే ప్రేమ జంట మాత్రం చాలా స్పెషల్. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత.. బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఫైనల్‌గా ప్రియురాలి డిమాండ్ విని ప్రియుడు షాక్ అయ్యాడు..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొన్నాళ్లకు బ్రేకప్.. అయితే చివరకు ఆమె డిమాండ్ విని ప్రియుడు షాక్..

ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం. ఒక్కోసారి కొందరు మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంటారు. అయితే వివిధ కారణాలతో అంతే త్వరగా విడిపోతూ ఉంటారు. విడిపోయాక చాలా మంది మళ్లీ వారినే తలచుకుంటూ, చెడు అలవాట్లకు బానిసై.. జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ జంట మాత్రం చాలా స్పెషల్. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత.. బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఫైనల్‌గా ప్రియురాలి డిమాండ్ విని ప్రియుడు షాక్ అయ్యాడు..


బ్రిటన్‌కు చెందిన అన్నాబెల్ అనే యువతి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ బాగానే తిరిగారు. ఈ క్రమంలో ప్రియుడి అవసరాలకు అన్నాబెల్ డబ్బు సాయం చేస్తూ ఉండేది. చిన్న చిన్న అవసరాలకు కూడా అతడు.. ప్రేయసిని అడిగి డబ్బులు తీసుకునేవాడు. అతనంటే ఎంతో ఇష్టం ఉండడతో ఆమె కూడా ఎంత అడిగితే.. అంత మొత్తాన్ని అందజేసేది. ఇలా వారి ప్రేమ కథ.. సవ్యంగా సాగిపోతున్న క్రమంలో, ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఒకరి మాటంటే ఒకరికి నచ్చడం లేదు. రోజూ గొడవలు జరుగుతుండడంతో చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు.


ఇద్దరూ విడిపోవాలని అనుకోవడంతో సమస్య లేకపోయినా యువతి మాత్రం కోపంతో ఉంది. అప్పటి వరకూ తాను ఇచ్చిన డబ్బులను మొత్తం తిరిగి ఇచ్చేయాలని ప్రియుడిని డిమాండ్ చేసింది. ఆమె మాటలకు షాకైన యువకుడు, అందుకు ఒప్పుకొన్నా.. ఆమెకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు ఇవ్వాల్సిన 51.37 పౌండ్స్(సుమారు రూ.5వేలు)ను నాణేల రూపంలో, ఓ చెప్పుల బాక్సులో పెట్టి ఇచ్చాడు. ఇది చూసి ఖంగుతిన్న ప్రియురాలు.. నాణేలను మెషిన్ సాయంతో లెక్కించుకుంది. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-11-29T01:23:36+05:30 IST