Viral Video: ఎంత కోపం వస్తే మాత్రం.. మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తారా.. మహిళపై మండిపడుతున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2021-10-30T01:37:53+05:30 IST
థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు పెయింటర్‌లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు.. ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది.. వీడియోను చూసిన

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు పెయింటర్‌లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు.. ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది.. వీడియోను చూసిన నెటిజనం మహిళను ఎదుకు తిడుతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
థాయ్‌లాండ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు.. వాటినిక మరమ్మత్తులు చేయించారు. అనంతరం బిల్డింగ్‌కు పెయింట్ వేయించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరు పెయింటర్లు తాడు సహాయంతో 26వ అంతస్థులకు వెళ్లి, పెయింటింగ్ పనిని ప్రారంభించారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఓ మహిళ తనను అడగకుండా ఎలా మరమ్మతులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పెయింటర్లు ఏర్పాటు చేసుకున్న తాడును కత్తిరించింది. దీంతో పెయింటర్లు కొద్దిసేపు 26వ అంస్థులో తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గాల్లోనే వేలాడారు. ప్రాణ భయంతో కేకలు పెట్టారు.
దీంతో అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న దంపతులు ఆ ఇద్దరి పెయింటర్లను రక్షించారు. పోలీసులుకు ఈ విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ మహిళ తొలుత తాడును తాను కత్తిరేంచలేదని వాదించింది. చివరకు నిజం ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. కాగా.. పెయింటర్లు ఇద్దరూ గాలి వేలాడుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందుకు సంబంధించిన వీడియె నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు.