76 ఏళ్ల టీచర్‌తో టీనేజ్ అమ్మాయి ప్రేమాయణం.. వీడియో కాల్ చేస్తూ ఊరింపు.. చివరికి ఆ అమ్మాయి చేసిన పని..

ABN , First Publish Date - 2021-10-29T15:34:33+05:30 IST

సోషల్ మీడియా లేని జీవితం ఇప్పడు ఊహించడం కష్టమేమో.. అంతగా మనుషులు దానికి అలవాటు పడిపోయారు. కానీ అదే సోషల్ మీడియా వల్ల హాని జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి...

76 ఏళ్ల టీచర్‌తో టీనేజ్ అమ్మాయి ప్రేమాయణం.. వీడియో కాల్ చేస్తూ ఊరింపు.. చివరికి ఆ అమ్మాయి చేసిన పని..

సోషల్ మీడియా లేని జీవితం ఇప్పడు ఊహించడం కష్టమేమో.. అంతగా మనుషులు దానికి అలవాటు పడిపోయారు. కానీ అదే సోషల్ మీడియా వల్ల హాని జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. 


భోపాల్‌కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ టీచర్ రవి వర్మకు(పేరు మార్చబడినది) ఫేస్‌బుక్ ఉపయోగించే అలవాటు ఎక్కవ. కొద్ది రోజుల క్రితం ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆ తరువాతి రోజు ఆయనకు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఒక అమ్మాయి. 


ఆ అమ్మాయికి వర్మ సార్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆయన ఒక గొప్ప టీచర్ అని పొగిడింది. తనకు ఆయన వద్ద చదువుకోవాలనే కోరిక ఉందని చెప్పింది. అ తరువాత.. రోజూ ఫోన్ చేసి మాట్లాడేది. అలా ఒక రోజు మాట్లాడుతూ ఆమెకు వర్మ సార్ ఇష్టమని చెప్పింది. ఆయనతో శృంగారం గురించి మాట్లాడింది. దీంతో వర్మగారు ఆ అమ్మాయి నెంబర్‌ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన వెంటనే ఆయనకు వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ చేసింది కూడా అదే అమ్మాయి. 


కానీ ఈ సారి ఆ అమ్మాయి హద్దుమీరి ప్రవర్తించింది. వీడియో కాల్‌లో ఆ అమ్మాయి తన బాత్ రూంలో నిలబడి ఉంది. ప్లీజ్ కాల్ కట్ చేయకండి.. అంటూ తన బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడింది. ఈ సారి వర్మగారు కాల్ కట్ చేయలేదు. ఆ అమ్మాయి అలా కాసేపు ఆయనతో ఏవో శృంగార విషయాలు మాట్లాడింది. ఆ రోజు రాత్రి వర్మ గారికి నిద్రపోతుండగా మళ్లీ అదే అమ్మాయి కాల్ చేసింది. ఇంతకు ముందు చేసిన వీడియో కాల్‌ని తాను రికార్ఢ్ చేశానని చెప్పింది. దీంతో వర్మగారికి కంగారుతో నిద్రపట్టలేదు.


రెండు రోజుల తరువాత మరో కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తన పేరు ప్రమోద్ కుమార్ అని, తాను ఢిల్లీ క్రైం విభాగంలో పోలీసుగా పనిచేస్తున్నాని చెప్పాడు. వర్మగారికి సంబంధించి ఒక అసభ్యకరమైన వీడియో సోషల్ మీడియాలో ఉందని, దానిని తొలగించాలంటే ఒక వ్యక్తికి ఫోన్ చేయండి అంటూ మరో నెంబర్ ఇచ్చాడు.  వెంటనే కాల్ చేయండి అని కూడా చెప్పాడు.


ఆ నెంబర్‌కి ఫోన్ చేయగా అతను ఒక యూట్యూబర్ అని, ఆ నగ్న వీడియోని తీయాలంటే చాలా ఖర్చు అవుతందని అన్నాడు. అతను ఇచ్చిన  HDFC బ్యాంక్ అకౌంట్‌లో రూ.1,30,000 వేయమన్నాడు. వర్మాగారు తన పరువు కాపాడుకోవడానికి అతనికి ఆ డబ్బు ఇచ్చేశారు. ఆ తరువాత కొన్ని రోజుల వరకు తన ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేశారు.


అలా చాలా రోజుల తర్వాత మళ్లీ ఫోన్ ఆన్ చేయగా.. మళ్లీ ప్రమోద్ కుమార్ ఫోన్ చేశాడు. వర్మగారి అడ్రస్ తెలిసిపోయిందని, త్వరలో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారని బెదిరించాడు.  అలా రాకుండా ఉండాలంటే.. వెంటనే రూ.2,35,000 తన బ్యాంక్ అకౌంట్‌లో వేయమని బెదిరించాడు. అరెస్ట్ అని చెప్పగానే.. వర్మగారికి చెమటలు పట్టాయి. అతనికి సరేనని చెప్పి అతను అడిగినంత డబ్బు వేశారు. కానీ ఆ తరువాత కూర్చొని ఆలోచించి తాను మోసపోయానని అర్థంచేసుకున్నారు.


ఇక ముందు వారు మళ్లీ తనను కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇంకా డబ్బు అడుగుతారని ఊహించి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగినదంతా చెప్పారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి నేరగాళ్ల కోసం వెతుకుతున్నారు.

Updated Date - 2021-10-29T15:34:33+05:30 IST