ఇంట్లో తనని వేధిస్తున్నారంటూ ప్రియుడికి అమ్మాయి ఫిర్యాదు.. కాలేజీ స్నేహితులతో కలసి ఆ ప్రియుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-26T12:29:28+05:30 IST

కాలేజీ చదువుకునే ఒక అమ్మాయి తనపై తన తల్లి రెండో భర్త అత్యాచారం చేశాడని, తనని శారీరకంగా వేధిస్తున్నాడని తన బాయ్‌ఫ్రెండ్‌తో చెప్పింది. తన తండ్రిని ఎలాగైనా హతమార్చాలని అతని సహాయం కోరింది...

ఇంట్లో తనని వేధిస్తున్నారంటూ ప్రియుడికి అమ్మాయి ఫిర్యాదు.. కాలేజీ స్నేహితులతో కలసి ఆ ప్రియుడు ఏం చేశాడంటే..

కాలేజీ చదువుకునే ఒక అమ్మాయి తనపై తన తల్లి రెండో భర్త అత్యాచారం చేశాడని, తనని శారీరకంగా వేధిస్తున్నాడని తన బాయ్‌ఫ్రెండ్‌తో చెప్పింది. తన తండ్రిని ఎలాగైనా హతమార్చాలని అతని సహాయం కోరింది. అప్పుడు ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలసి ఏం చేశాడంటే..


బెంగుళురుకు చెందిన స్వప్న(17) ఇంటర్మీడియట్ చదువుకుంటోంది. ఆమె తండ్రి రమాకాంత్(46) (తల్లికి రెండో భర్త) ఒక సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. రమాకాంత్ తనపై అత్యాచారం చేశాడని, తనని శారీరికంగా హింసిస్తున్నాడని స్వప్న తన ప్రియుడు రాజేశ్‌తో చెప్పింది. రమాకాంత్‌ని ఎలాగైనా హత్య చేసేందుకు తనకు సహాయం చేయాలని రాజేశ్‌ని కోరింది.


ఆ తరువాత ఒకరోజు స్వప్న తల్లి ఇంట్లో లేనప్పుడు రాజేశ్ తన స్నేహితులతో కలిసి రమాకాంత్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. రమాకాంత్ చనిపోగానే స్వప్న తన పొరిగింటికి వెళ్లి 'నాన్న కింద పడిపోయి ఉన్నాడని.. ఎంత పిలిచినా లేవడం లేదని' చెప్పింది. వాళ్లు వచ్చి చూసేసరికి రమాకాంత్ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు స్వప్నని విచారణలో భాగంగా ప్రశించగా.. ఆమె తన సమాధానాలు ప్రతిసారి మార్చి చెప్పడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు స్వప్నచేత నిజం చెప్పించారు. తన ప్రియుడు రాజేశ్, అతని స్నేహితులతో కలిసి రమాకాంత్‌ని హత్యచేసి పారిపోయారని చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. రాజేశ్, అతని మిత్రులు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-11-26T12:29:28+05:30 IST