ఇన్‌స్టాగ్రాంలో చిగురించిన ప్రేమ.. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన బాలిక.. ముంబైలోని మురికివాడలో గది అద్దెకు తీసుకుని..

ABN , First Publish Date - 2021-12-13T01:13:54+05:30 IST

బాలికది స్వీడన్, యువకుడిది ముంబైలోని మురికివాడ. ఇన్‌స్టాగ్రాంలో మొదలైన పరిచయం కాస్తా.. ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రియుడి కోసం అక్కడి నుంచి ఇండియాకు వచ్చింది. తర్వాత..

ఇన్‌స్టాగ్రాంలో చిగురించిన ప్రేమ.. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన బాలిక.. ముంబైలోని మురికివాడలో గది అద్దెకు తీసుకుని..

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడెక్కడి వారో పరిచయం అవుతుంటారు. ఆఖరికి దేశాల సరిహద్దులకు అవతల ఉండే వారు కూడా దగ్గరి స్నేహితులవుతుంటారు. ఒక్కోసారి ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చి... ప్రేమాయాణం మొదలెడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ ప్రేమ కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలికది స్వీడన్, యువకుడిది ముంబైలోని మురికివాడ. ఇన్‌స్టాగ్రాంలో మొదలైన పరిచయం కాస్తా.. ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రియుడి కోసం అక్కడి నుంచి ఇండియాకు వచ్చింది. తర్వాత వారి ప్రేమ కథలో పలు ట్విస్టులు చోటుచేసుకున్నాయి.. వివరాల్లోకి వెళితే..


సర్దార్ తోమర్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తి.. స్వీడన్‌లో స్థిరపడ్డాడు. వ్యాపారవేత్త అయిన ఇతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కుమార్తె(16)కు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రాంలో ముంబై మురికివాడకు చెందిన 18ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో నవంబర్ 27న ఇంట్లో చెప్పకుండా టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చేసింది. ముంబైలో ఉన్న ప్రియుడిని కలుసుకుంది. ఇద్దరూ కలిసి మురికివాడలో ప్రత్యేకంగా గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు.

పొలంలో కనిపించినవి పిల్లి కూనలే అనుకుని పులి పిల్లలను ఇంటికి తెచ్చిన రైతు.. రోజూ పాలు పోసి, స్నానం చేయించేవాడు.. చివరకు..


కూతురు కనిపించడం లేదంటూ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న స్వీడన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ ఆధారంగా ఆమె ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ వ్యవహారం కావడంతో ఇంటర్ పోల్‌ను ఆశ్రయించారు. బాలికపై ఎల్లో నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్ అధికారులు.. ఆమె వివరాలను ముంబై పోలీసులకు అందించారు. మురికివాడలోని అన్ని ప్రాంతాలను జల్లెడపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు 15 రోజుల తర్వాత ప్రేమికులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం బాలికను ఆమె తండ్రితో పాటూ పంపించారు.

బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..

Updated Date - 2021-12-13T01:13:54+05:30 IST