కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎంతమంది ప్రాణాలతో మిగిలారు..? రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి లెక్కెంతంటే..
ABN , First Publish Date - 2021-08-27T16:29:56+05:30 IST
ఎటు చూసినా శవాల గుట్టలు.. ఏరులై పారుతున్న రుధిరధారలు.. చేతులో, కాళ్లో తెగిపడి రక్తపు ముద్దలా మిగిలిపోయిన జీవశ్ఛవాలు.. ఓడినవారి విలాపాలు..
ఎటు చూసినా శవాల గుట్టలు.. ఏరులై పారుతున్న రుధిరధారలు.. చేతులో, కాళ్లో తెగిపడి రక్తపు ముద్దలా మిగిలిపోయిన జీవశ్ఛవాలు.. ఓడినవారి విలాపాలు.. గెలిచిన వారి వికటాట్టహాసాలు.. శ్మశానాన్ని తలపించే ప్రాంతాన్ని ఏలుకోవడానికి ఆరాటాలు.. ఇవీ.. యుద్ధం ముగిసిన తర్వాత కనిపించే దృశ్యాలు. కురుక్షేత్ర యుద్ధం మొదలుకుని.. రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రతీ యుద్ధంలోనూ ఇవే సీన్లు రిపీటయ్యాయి. యుద్ధం అంటేనే మానవహననం. ఈ యుద్ధంలో అనివార్యంగానే లక్షలాది మంది అమాయక ప్రజలు బలవాల్సి వస్తుంది. అంతకు ఎన్నో రెట్ల సంఖ్యలో మూగజీవాలు బలవుతుంటాయి. ప్రాణనష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. యుద్దంలో వాడిన అస్త్రాల ప్రభావం ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై ఎన్నో ఏళ్ల పాటు ఉంటుంది. గడ్డిపోచ కూడా మొలవని పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌కు చెందిన హీరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబుల ప్రభావం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. అసలు రెండో ప్రపంచ యుద్ధంలో ఎంత మంది చనిపోయారు..? భారత ఇతిహాసాల్లో ఎంతో గొప్పగా ఘనంగా అభివర్ణించబడిన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య ఎంత..? ఎంత మంది మరణించారు..? వంటి సంగతుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
(మహాభారతం.. సరళవ్యావహారికంలో చదువుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..)
మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం. త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతార మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి, దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు. ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిర ధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది. ద్వాపర యుగంలో జరిగిన యీ మహాసంగ్రామంలో పద్ధెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత?
ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు.
అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’.
మూడు సేనాముఖాలు ఒక గుల్మం.
మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’.
మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’.
మూడు వాహినులొక ‘‘పృతన’’.
మూడు పృతనలొక ‘‘చము’’.
మూడు చములొక ‘‘అనీకిని’’.
పది అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి.
ఇది కూడా చదవండి: యుద్ధంలో గెలిచేది పాండవులే అని నాకు తెలుసు.. అయినా దుర్యోధనుడి వెంటే ఉంటాను.. అంపశయ్యపై ఉన్న భీష్ముడికి తేల్చిచెప్పిన కర్ణుడు..
అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే. రెండో ప్రపంచయుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి ఏడు కోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని ప్రస్తుత పరిస్థితులను బట్టి స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: ధర్మంగా పోరాడితే భీముణ్ణే కాదు, మిమ్మల్నందర్నీ నేను అవలీలగా మట్టి కరిపించేవాణ్ణి.. భీముడి దెబ్బకు నేలకూలిన తర్వాత ధుర్యోధనుడు అన్న ఈ మాటల్ని శ్రీకృష్ణుడు విని..

అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు. మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అంటే 19 లక్షల 68 వేల 300 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఇంతకు ఎన్నో రెట్ల స్థాయిలో జంతు నష్టం, ఆస్తినష్టం సంభవించింది. మొత్తం 18 రోజుల పాటు జరిగిన యుద్ధం ముగిసిన తర్వాత.. కేవలం పది మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు. పంచపాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులతోపాటు కృష్ణుడు, సాత్యకి, అశ్వథ్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే యుద్ధం ముగిసిన తర్వాత ప్రాణాలతో మిగిలి ఉన్నారు. కేవలం పద్ధెనిమిది రోజులు జరిగిన యుద్ధం యిది.
ఇది కూడా చదవండి: సూత పుత్రుడైన కర్ణుడికి సారథిగా ఉండమంటావా..?.. దుర్యోధనుడిపై ఆగ్రహించిన శల్యుడు..
