వారు సమోసా, ఛాట్ అమ్ముతుంటారు.. కానీ, వారి ఆస్తుల గురించి తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

ABN , First Publish Date - 2021-07-22T21:42:16+05:30 IST

వారు రోడ్ల పక్కన బళ్లు పెట్టుకని ఛాట్ అమ్ముతుంటారు.. చిన్న చిన్న షాపుల్లో సమోసాలు విక్రయిస్తుంటారు..

వారు సమోసా, ఛాట్ అమ్ముతుంటారు.. కానీ, వారి ఆస్తుల గురించి తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

వారు రోడ్ల పక్కన బళ్లు పెట్టుకని ఛాట్ అమ్ముతుంటారు.. సమోసాలు విక్రయిస్తుంటారు.. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు.. అలాగని వారు పేదవారు కాదు..  వారి పేరు మీద ఉన్న ఆస్తుల విలువెంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఆ ఆస్తులు వేరెవరివో కాదు.. వ్యాపారం చేస్తూ స్వయంగా వారు సంపాదించుకున్నవే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చిరు వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ తాజాగా జరిపిన దాడుల్లో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. వారిలో 256 మంది కోటీశ్వరులని తాజాగా బయటపడింది. 


ఐటీ శాఖ నివేదిక ప్రకారం.. వీరి ఆదాయం ఏడాదికి కోట్లలో ఉంటుంది. కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లున్నాయి. కొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది. అయినా వీరెవరూ ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. కనీసం జీఎస్‌టీ పరిధిలో కూడా లేరు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 256 మంది గత నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని తెలిపారు. 


ప్రభుత్వాన్ని మాయ చేయడానికి కొందరు వ్యాపారలు సహాకర బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ తాము పేద వాళ్లమని నమ్మిస్తున్నారని, మరికొందరు బంధువుల పేర్లతో ఆస్తులు కొంటున్నారని ఐటీ శాఖ దర్యాఫ్తులో తేలింది. తాజాగా వీరిపై నిఘా పెట్టిన ఐటీ శాఖ వీరి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పరిశీలించి వీరి ఆస్తుల వివరాలను బయటపెట్టింది. 

 

Updated Date - 2021-07-22T21:42:16+05:30 IST