సీరియస్‌గా సీరియల్ చూస్తున్న కుటుంబం.. ఇంతలో పైఅంతస్తు నుంచి శబ్ధాలు.. కంగారుగా పరుగెత్తుకుంటూ పైకెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-12-29T03:18:55+05:30 IST

తమిళనాడులో ఓ కుటుంబం మొత్తం సీరియల్‌లో లీనమైంది. ఇంతలో పై అంతస్తు నుంచి శబ్ధాలు వినిపించాయి. అప్పటికి గానీ వారికి పైన ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తీరా ఒక్కసారిగా తేరుకుని పైకెళ్లి చూసి షాక్ అయ్యారు..

సీరియస్‌గా సీరియల్ చూస్తున్న కుటుంబం.. ఇంతలో పైఅంతస్తు నుంచి శబ్ధాలు.. కంగారుగా పరుగెత్తుకుంటూ పైకెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

సీరియళ్ల ప్రభావం మహిళలపై ప్రస్తుతం ఏమేర ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్కరోజు కూడా వదలకుండా టీవీలకు అతుక్కుపోయి మరీ సీరియళ్లను చూస్తుంటారు. ఆ సమయంలో వారికి ఇంకేమీ పట్టదు. పక్కన ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా సీరియళ్ల మాయలో పడుతుంటారు. తమిళనాడులో కూడా ఓ కుటుంబం మొత్తం సీరియల్‌లో లీనమైంది. ఇంతలో పై అంతస్తు నుంచి శబ్ధాలు వినిపించాయి. అప్పటికి గానీ వారికి పైన ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తీరా ఒక్కసారిగా తేరుకుని పైకెళ్లి చూసి షాక్ అయ్యారు. వివారాల్లోకి వెళితే..


తమిళనాడులోని కాంచీపురంలో మారుతీనగర్‌కి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజుల కిందట వింత ఘటన చోటుచేసుకుంది. అందరి ఆడవాల్ల మాదిరే శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కూడా సీరియల్ పిచ్చి విపరీతంగా ఉండేది. కుటుంబంలోని మహిళలు మొత్తం నిత్యం సీరియళ్లలో లీనమవుతూ ఉంటారు. ఆ సమయంలో వారు ఇంకేమీ పట్టించుకునేవారు. రెండు రోజుల కిందట రాత్రి 9గంటల సమయంలో ఇలాగే సీరియస్‌గా సీరియల్ చూస్తూ ఉన్నారు. వాళ్ల గురించి తమకు బాగా తెలుసు అనుకున్నారో.. ఏమో గానీ .. కొందరు దొంగలు వారి పైఅంతస్తులోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 44 తులాల బంగారం, కిలో వెండి, నగదును సర్దుకున్నారు.

యాప్‌లో పరిచయమైన వ్యక్తితో మహిళ డేటింగ్ నిర్ణయం.. అయితే కలవడానికి కాస్త ముందు.. అతడి గురించి తెలిసి..


ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో సీరియల్ చూస్తున్నవారంతా ఉలిక్కిపడి.. పైన ఏం జరుగుతుందోనని చూడటానికి వెళ్లారు. ఇంకేముంది అంతా సర్దుకుని బయటికెళ్లేందుకు దొంగలు సిద్ధంగా ఉన్నారు. వీరిని చూడగానే కత్తులతో బెదిరించారు. ఎవరికైనా చెబితే పొడిచేస్తాం.. అంటూ బెదిరించి అక్కడనుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని, పరిశీలించారు. దొంగల కోసం అన్వేషిస్తున్నారు. ఇంట్లో అంతా ఉండగానే దొంగలు దర్జాగా దోచుకెళ్లారన్న వార్త.. స్థానికంగా సంచలనం కలిగించింది.

భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆమెను పిలుచుకురావడానికి వెళ్లి.. మద్యం మత్తులో భర్త చేసిన పని..

Updated Date - 2021-12-29T03:18:55+05:30 IST