చాణక్య నీతి: మీకు ఈ 3 పరిస్థితులు ఎదురైనపుడు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి.. అది పిరికితనం కాదు.. ఎంతో తెలివైన పని!

ABN , First Publish Date - 2021-12-07T12:38:29+05:30 IST

ఆచార్య చాణక్య పండితుడు. అత్యున్నత..

చాణక్య నీతి: మీకు ఈ 3 పరిస్థితులు ఎదురైనపుడు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి.. అది పిరికితనం కాదు.. ఎంతో తెలివైన పని!

ఆచార్య చాణక్య పండితుడు. అత్యున్నత అర్హత కలిగిన అధ్యాపకుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, అక్కడే చాలా కాలంపాటు అధ్యాపక పదవిని చేపట్టి, అనేక రచనలు చేశారు. ఆచార్యుల చాణక్యనీతి నేటికీ ఎంతో ఆదరణ పొందుతోంది.

దుర్మార్గులు నివసించే ప్రదేశాన్ని విడిచిపెట్టడం వలన మీరు ఎన్నటికీ పిరికివాడిగా అనిపించుకోరని ఆచార్య చాణక్య తెలిపారు. అది మీ విజ్ఞతకు చిహ్నం. దుర్మార్గులు ఎన్నటికీ నమ్మదగినవారు కాదు. వారు ఎవరికైనా, ఎప్పుడైనా హాని తలపెడతారు. అందుకే దుర్మార్గులు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టడం తెలివైన పని అని ఆచార్య చాణక్య తెలిపారు. 

అకస్మాత్తుగా శత్రువు మీపై దాడి చేసినప్పుడు లేదా మీరు శత్రువును జయించలేని పరిస్థితుల్లో అక్కడ నుండి పారిపోవడమే తెలివైన పని. శత్రువును సరైన వ్యూహంతో ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే మీరు గెలవగలరు.


ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం కరువుకాటకాలు ఉన్న ప్రదేశంలో ఉండడం మూర్ఖత్వం. ఎందుకంటే మీ జీవితంలో దుర్బిక్ష పరిస్థితులు ఎదురైనపుడు మీరు ఏమీ చేయలేరు. అందువల్ల ఇటువంటి పరిస్థితులకు అనవసరంగా మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. వెంటనే అలాంటి ప్రదేశాన్ని విడిచిపెట్టాలని చాణక్య తెలిపారు. 

కష్ట సమయాల్లో భయంతో పారిపోవడం పిరికితనానికి సంకేతంగా పరిగణించవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పారిపోవడాన్ని పిరికితనం అనుకోకూడదు. దానిని పరిస్థితులను అర్థం చేసుకోవడం అనుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతిలో ఆచార్య కొన్ని విపత్కర పరిస్థితులను ప్రస్తావించాడు. అటువంటి పరిస్థితుల్లో పారిపోవడమే తెలివైన నిర్ణయమని ఆచార్య తెలిపారు. Updated Date - 2021-12-07T12:38:29+05:30 IST