నగల షాపులో రూ.కోటిపైగా దొంగతనం.. నగలతో పారిపోతున్న దొంగలను అడ్డుకున్న పోలీసులు.. వారు ఎలా తప్పించుకున్నారంటే..

ABN , First Publish Date - 2021-10-07T11:55:52+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నగరంలో ఓ నగల షాపు నుంచి రూ.1.25 కోట్ల విలువగల బంగారు నగలు దోచుకొని ముగ్గురు దొంగలు పారిపోతున్నారు. అలా పారిపోతున్న దొంగలను రాత్రిపూట డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు దొంగల భుజాలపై నగలతో నిండిన మూటలున్నాయి...

నగల షాపులో రూ.కోటిపైగా దొంగతనం.. నగలతో పారిపోతున్న దొంగలను అడ్డుకున్న పోలీసులు.. వారు ఎలా తప్పించుకున్నారంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నగరంలో ఓ నగల షాపు నుంచి రూ.1.25 కోట్ల విలువగల బంగారు నగలు దోచుకొని ముగ్గురు దొంగలు పారిపోతున్నారు. అలా పారిపోతున్న దొంగలను రాత్రిపూట డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు దొంగల భుజాలపై నగలతో నిండిన మూటలున్నాయి. 


పోలీసులు వాళ్లని ఆపి విచారణ చేశారు. "ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఏ ఊరు మీది? భుజాలపై ఆ మూటలు ఏంటి? అందులో ఏముంది?" అని వారిని ప్రశ్నించారు. తాము బట్టల వ్యాపారులమని, సమీప గ్రామాల నుంచి వచ్చామని, ఇప్పుడు తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం కోసం రైల్వే స్టేషన్‌కు బయలుదేరామని ఆ దొంగలు చెప్పారు. 


దొంగలు చెప్పిన సమాధానాలపై కాస్త అనుమానం వచ్చి చివరికి.. పోలీసులు తమ మొబైల్‌లో ఆ ముగ్గురి దొంగల ఫోటోలు తీసుకున్నారు. తరువాత వారిని వెళ్లనిచ్చారు. అలా పోలీసుల నుంచి సులువుగా ఆ దొంగలు తప్పించుకున్నారు. మరుసటి రోజు ఉదయం నగరంలోని ఓ పెద్ద నగల షాపులో దొంగతనం జరగిందని తెలియడంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని ఆధికారులు పిలిపించారు. వారిని నగల షాపు సిసిటీవి వీడియో చూపించారు. అది చూసిన వారు అవాక్కయ్యారు. ఆ సిసిటీవి వీడియోలో ఉన్నవారు రాత్రి తాము కలిసిన దొంగలే.


ఆ ముగ్గురు దొంగలు జార్ఖండ్ నుంచి ఒడిశా వైపు వెళ్తున్నట్లు ఒక టోల్ ప్లాజా వీడియోలో తేలింది. పోలీసులు వారి కోసం గాలిస్తుండగా.. వాళ్లంతా దొంగతనం చేసేముందు నగల షాపు సమీపంలోని ఒక లాడ్జిలో బస చేశారని, దొంగతనం చేసే ముందు షాపులో ఒకసారి రెక్కీ నిర్వహించారిని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇప్పుడు పోలీసుల వద్ద ఆ ముగ్గురు దొంగల గుర్తింపు కార్డుల కాపీ ఉంది. దాని ఆధారంగా వాళ్లని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-07T11:55:52+05:30 IST