అంబులెన్స్ దొరకకపోవడంతో బైక్‌పై మృతదేహం తరలింపు!

ABN , First Publish Date - 2021-04-24T16:44:22+05:30 IST

బీహార్‌లోని రోహతాస్‌లో మానవత్వం మంటగలసిన సంఘటన

అంబులెన్స్ దొరకకపోవడంతో బైక్‌పై మృతదేహం తరలింపు!

పట్నా: బీహార్‌లోని రోహతాస్‌లో మానవత్వం మంటగలసిన సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ దొరకని కారణంగా మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్టుండి అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రి గేటు దగ్గరకు చేరుకోగానే, ఆ వృద్ధుడు ప్రాణాలొదిలాడు. 




అంతకుముందు అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఏ బైక్‌పైన... ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని తీసుకువచ్చారో, తిరిగి అతని మృతదేహాన్ని అదే బైక్‌పై తీసుకు వెళ్లాల్సి వచ్చింది. కాగా ఆ వృద్ధుడు ఏ కారణంతో మృతి చెందాడో తెలియరాలేదు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా వారు మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సివచ్చింది. కాగా బీహార్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీహార్ రాజధాని పట్నాలో పరిస్థితులు భీతావహంగా మారాయి. ఇక్కడ 750మందికి పైగా వైద్యులకు, హెల్త్ వర్కర్లకు కరోనా సోకింది. 

Updated Date - 2021-04-24T16:44:22+05:30 IST