మార్కెట్లలో రక్షాబంధన్ రద్దీ.... కనిపించని కరోనా నిబంధనలు!

ABN , First Publish Date - 2021-08-21T15:53:33+05:30 IST

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే

మార్కెట్లలో రక్షాబంధన్ రద్దీ.... కనిపించని కరోనా నిబంధనలు!

సిమ్లా: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ రాఖీ. రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లలో రాఖీల విక్రయాల సందడి కనిపిస్తోంది. అయితే మార్కెటల్లో కరోనా నియమాల ఉల్లంఘన అడుగడుగునా కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ వాటిని దుకాణదారులు, కొనుగోలుదారులు పట్టించుకోవడం లేదు. 


రాఖీ పండుగకు ఇక ఒక్కరోజే ఉండటంతో మార్కెట్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇదేవిధంగా మిఠాయి దుకాణాల వద్ద కూడా కొనుగోలుదారులు బారులుతీరి కనిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Updated Date - 2021-08-21T15:53:33+05:30 IST