బస్తీ వాసులు పాఠశాలను మరుగుదొడ్డి కోసం వినియోగిస్తున్నారని తెలిసి.. ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-21T19:08:14+05:30 IST

'ఏ బృహత్కార్యమైనా..

బస్తీ వాసులు పాఠశాలను మరుగుదొడ్డి కోసం వినియోగిస్తున్నారని తెలిసి.. ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలిస్తే..!
మనీషా సింగ్

శ్రీమంతురాలు..!


ఇంటర్‌నెట్‌డెస్క్: 'ఏ బృహత్కార్యమైనా ఒక్కడితోనే మొదలవుతుంది' అని చెబుతుంటారు. అవును ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను మనం అనేక సినిమాలలో చూసే ఉంటాం. ఉదాహరణకు శ్రీమంతుడు సినిమాను తీసుకుందాం. ఆ సినిమాలో హీరో మహేష్‌బాబు కూడా తాను పుట్టిన గ్రామం కోసం ఒక్కడై కష్టపడతారు. చివరికి గ్రామస్థుల సహకారంతో ఆయన అనుకున్న పనిని పూర్తిచేస్తారు. అలాగే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా ఒక్కరిగా మొదలుపెట్టి.. బస్తీవాసుల సహకారంతో 70ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రూపురేఖలనే మార్చేసింది. సినిమాలో మహేష్‌బాబు గ్రామం కోసం పాటుపడితే.. ఇప్పుడు చెప్పనున్న వ్యక్తి ఓ పాఠశాల కోసం కష్టపడింది. అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..


రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా జగత్‌పుర పట్టణంలో మనోహరపుర కచి అనే బస్తీ ఉంది. ఆ బస్తీలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. దానిని దాదాపుగా 80 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం అది పాతబడడంతో.. బస్తీవాసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సంపన్న కుటుంబంలో పుట్టిన మనీషా సింగ్‌కు ఈ పాఠశాల గురించి మూడేళ్ల క్రితం తెలిసింది. అక్కడకు వెళ్లి పాఠశాల పరిస్థితిని పరిశీలించింది. పిల్లలు చదువుకునే ప్రాంతం ఇలాగేనా ఉండేదని ఉపాధ్యాయులను అడిగింది. తామేంతో ప్రయత్నించి చూశామని కానీ బస్తీవాసులు తమ మాట వినకుండా ఇదే దారిలో మరుగుదొడ్డికి వెళ్తున్నారని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ పాఠశాలకోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని మనీషా అప్పుడే సంకల్పించుకుంది. బస్తీవాసులతో మాట్లాడింది. అందులో కొంతమంది ఆమె మాట విన్నారు. మరికొంతమంది ఆమె మాటను పెడచెవిన పెట్టారు. దీంతో చేసేదేమి లేక ఆమె ఓ నిర్ణయానికొచ్చింది. ముందుగా పాఠశాల భవనం చుట్టూ ఓ గోడ నిర్మించాలనుకుంది. ప్రభుత్వ సహాయం కోరకుండా పనికి పూనుకుంది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన లయన్స్ కబ్ల్.. ఆమెకు సహకారమందిచాలనుకుంది. అంతేకాకుండా మరొకొంత మంది బస్తీవాసులు కూడా ఆమెకు సహాయం చేశారు. అందరూ కలిసి ప్రహారీ గోడ నిర్మించారు. దీంతో విద్యార్థులకు బస్తీవాసుల బెడద తగ్గిపోయింది. మరుగుదొడ్డి కోసం వారందరూ వేరే దారి వెతుకున్నారు.


పాఠశాల ప్రహారీ గోడలపై కలర్ పెయింటింగ్స్ వేయించడంతో పిల్లలకు చదువుకునే వాతావరణాన్ని మనీషా కల్పించినట్టైంది. అంతేకాకుండా లయన్స్ క్లబ్ సహకారంతో రెండు మరుగుదొడ్లను(ఒకటి బాలురకు, మరొకటి బాలికలకు) నిర్మించింది. రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే.. అమ్మాయిలకు స్వీయరక్షణ గురించి తెలిసి ఉండాలని, అందుకోసం కరాటే విద్యను కూడా నేర్పించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మనీషా సింగ్ చేసిన మరికొన్ని గొప్ప పనుల గురించి చెప్పుకోవాలి. పిల్లలు మధ్యలోనే పాఠశాలను వదిలేయకుండా.. చదువువైపే వారి దృష్టి కేంద్రీకరించాలని కొన్ని బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించి పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. బస్తీప్రాంత వాసులు కావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి తెలిసిన మనీషా.. పిల్లలకు ఉచితంగా చదువుకు అవసరమయ్యే వస్తువులు ఇచ్చేది. పిల్లలు చదవుకోవడానికి తరగతి గదిలో చార్ట్‌లు కూడా ఏర్పాటు చేయించింది. అంతేకాదండోయ్.. అదే పాఠశాలలో ఆమె ఉచితంగా బోధిస్తోంది కూడా. చివరిగా పాతబడిన ఈ పాఠశాలను.. ఓ మోడల్ స్కూల్‌గానే మార్చేసిన మనీషాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..Updated Date - 2021-10-21T19:08:14+05:30 IST