ఒకే స్కూటీపై నలుగురు కుర్రాళ్ల ప్రయాణం.. ఇంటికి వెళ్లిన ట్రాఫిక్ పోలీసులు.. ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2021-12-14T20:39:41+05:30 IST

పోలీసులు ఎంత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలను రూపొందించినా వాటిని చాలా మంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు.

ఒకే స్కూటీపై నలుగురు కుర్రాళ్ల ప్రయాణం.. ఇంటికి వెళ్లిన ట్రాఫిక్ పోలీసులు.. ఏం చేశారంటే..

పోలీసులు ఎంత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలను రూపొందించినా వాటిని చాలా మంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. ముఖ్యంగా యువకులు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడాన్ని ఓ సాహసంగా భావిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇలాగే ప్రవర్తించిన నలుగురు కుర్రాళ్లకు పోలీసులు గుణపాఠం చెప్పారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ ఫైన్ వసూలు చేశారు. అంతేకాదు వారి రైడింగ్‌కు సంబంధించిన ఫొటోలను వారి తల్లిదండ్రులకు చూపించారు. 


ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌ నగరంలోని తేలిబందా ప్రాంతంలో నలుగురు కుర్రాళ్లు ఒకే స్కూటీపై ప్రయాణం చేశారు. పోలీసులు ఉన్న చోట ఇద్దరు దిగిపోయి.. లేని చోట నలుగురూ ఎక్కి ఆ స్కూటీపై ప్రయాణించారు. ఒకే స్కూటీపై నలుగురు వెళ్తుండడాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసులకు పంపించారు. స్కూటీ మీద ఉన్న నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ కుర్రాళ్ల ఇళ్లకు వెళ్లారు. ఆ ఫొటో చూపించి రూ.6 వేలు జరిమానా వసూలు చేశారు. ఆ ఫొటోను ఆ కుర్రాళ్ల తల్లిదండ్రులకు చూపించారు. ఆ బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-12-14T20:39:41+05:30 IST