కడుపు నొప్పితో మెలికలు తిరిగిన 11 ఏళ్ల బాలిక.. వెంటనే ఆస్పత్రికి తరలింపు.. అక్కడ జరిగింది చూసి కుటుంబ సభ్యులు షాక్!

ABN , First Publish Date - 2021-12-08T17:27:25+05:30 IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలిక..

కడుపు నొప్పితో మెలికలు తిరిగిన 11 ఏళ్ల బాలిక.. వెంటనే ఆస్పత్రికి తరలింపు.. అక్కడ జరిగింది చూసి కుటుంబ సభ్యులు షాక్!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలిక.. ఒక శిశువుకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ బాలిక తాను గర్భం దాల్చినప్పటికీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ చెప్పకపోవడం విశేషం. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో దర్యాప్తు ప్రారంభమయ్యింది. ఈ ఘటన ఖెర్వాడా గ్రామంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డిసెంబరు 4న డూంగర్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 


అక్కడ ఆ బాలిక ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు ఆసుపత్రికి చేరుకుని ఆ బాలిక తండ్రి రమేష్, వారి బంధువు రుషభ్ దేవ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన నిందితుడు రుషభ్ దేవ్‌ గుజరాత్‌లో కూలీ పనులు చేస్తుంటాడని, రమేష్‌కు బంధువు అయినందున రుషభ్ దేవ్‌ వారి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉంటుంటాడన్నారు. ఈ నేపధ్యంలో ఆ చిన్నారిని ప్రలోభాలకు గురిచేసి, అత్యాచారం చేశాడు. ఈ కారణంగా  ఆ చిన్నారి గర్భం దాల్చిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T17:27:25+05:30 IST