కిలోల కొద్దీ పాము విషం సేకరణ.. దేనికి వాడుతున్నారంటే.. కేజీ విలువ ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2021-11-21T21:56:07+05:30 IST

అక్రమార్కులు దేన్నీ వదలడం లేదు. కాసులు వస్తాయంటే చాలు.. ఎంతకైనా తెగిస్తున్నారు. అక్రమంగా ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్ తదితరాలను తరలించడం చూస్తుంటాం. కానీ ఆఖరికి పాము విషాన్ని కూడా వదలడం లేదు.

కిలోల కొద్దీ పాము విషం సేకరణ.. దేనికి వాడుతున్నారంటే.. కేజీ విలువ ఎంతో తెలుసా..

అక్రమార్కులు దేన్నీ వదలడం లేదు. కాసులు వస్తాయంటే చాలు.. ఎంతకైనా తెగిస్తున్నారు. అక్రమంగా ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్ తదితరాలను తరలించడం చూస్తుంటాం. కానీ ఆఖరికి పాము విషాన్ని కూడా వదలడం లేదు. కిలోల లెక్కన విషాన్ని సేకరించి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.


ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని సిందూర్‌పాంక్‌‌కు చెందిన కైలాష్ చంద్ర సాహు, రంజన్‌కుమార్ పాధి అనే వ్యక్తులు పాము విషంతో వ్యాపారం చేస్తున్నారు. సమాచారం అందుకున్న దేవ్‌ఘర్ పోలీసులు.. మారువేషంలో అక్కడికి వెళ్లారు. తమకు విషం కావాలంటూ వారితో మాట కలిపారు. పోలీసులని తెలీక నిందితులు వారితో కూడా బేరమాడారు. కిలోల కొద్దీ విషాన్ని నింపిన బాటిళ్లను చూడగానే షాక్ అయ్యారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిలో విషం సుమారు రూ.1.50కోట్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. కిలో విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.


నిందితులు చాలా కాలంగా దీన్నే వృత్తిగా ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం అందడంతో దాడి చేసినట్లు వివరించారు. కిలో విషాన్ని డిమాండ్‌ను బట్టి ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతుంటారని చెప్పారు. ఈ విషాన్ని వివిధ రకాల మందులు, బీరు తదితరాల తయారీలో వినియోగిస్తుంటారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషాన్ని పరీక్షల నిమిత్తం.. ప్రయోగశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషాన్ని సేకరించేందుకు ఎవరు సహకరిస్తున్నారు.. అనంతరం దాన్ని ఎక్కడకు తరలిస్తున్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో చాలా సార్లు ఇలాగే బీహార్‌ నుంచి విదేశాలకు విషాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-21T21:56:07+05:30 IST