ఆన్‌లైన్‌లో ఫుట్‌బాల్ కోసం ఆర్డర్.. ఆనందంగా ఎగిరిగంతులేస్తూ బాక్స్ తెరిచి చూడగానే.. అది కనిపించేసరికి షాకయ్యాడు!

ABN , First Publish Date - 2021-10-20T17:44:54+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ప్రస్తుతం..

ఆన్‌లైన్‌లో ఫుట్‌బాల్ కోసం ఆర్డర్.. ఆనందంగా ఎగిరిగంతులేస్తూ బాక్స్ తెరిచి చూడగానే.. అది కనిపించేసరికి షాకయ్యాడు!

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ప్రస్తుతం ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. బంపర్ ఆఫర్లు ఇస్తామంటూ పలు కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే కొందరు ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలకు గురవుతున్నారు. తాజాగా ఒక వినియోగదారునికి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. అతను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో ఫుట్‌బాల్ ఆర్డర్ చేశాడు. ఆ ఫుట్‌బాల్ వచ్చాక ఆనందంగా ఆడుకోవచ్చని కలలుగన్నాడు. డెలివరీ బాయ్ తెచ్చిన బాక్సు ఓపెన్ చేసి చూడగానే ఊహకందని విధంగా మరొకటి కనిపించేసరికి షాకయ్యాడు. 


పండుగల లైవ్ సేల్ చూసిన వినియోగదారులు ఖరీదైన వస్తువులను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని ఆశపడుతూ వాటిని బుక్ చేస్తున్నారు. ఇదేవిధంగా ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో  ఫుట్‌బాల్ ఆర్డర్ చేశాడు. రెండురోజుల తరువాత డెలివరీ బాయ్ తెచ్చిన బాక్స్‌ను ఆనందంగా తెరిచి చూసి షాకయ్యాడు. ఆ బాక్సులో ఫుట్‌బాల్‌కు బదులు మహిళల లోదుస్తులైన బ్రా ఉంది. @LowKashWala అనే యూజర్‌కు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. తనకు ఫుట్‌బాల్ బదులు బ్రా డెలివరీ చేశారని, దీనిని ఎక్స్‌ఛేంజ్ చేయాలని కోరగా, సదరు కంపెనీ అందుకు నిరాకరించిందని వాపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశాడు.

Updated Date - 2021-10-20T17:44:54+05:30 IST