ఒకప్పుడు తిండికి లేక అలమటించాడు.. నేడు అతడి నెలవారీ ఆదాయం లక్షల్లో..!

ABN , First Publish Date - 2021-07-09T00:22:47+05:30 IST

కొంత కాలం క్రితం వరకూ అతడో బడుగు జీవి! రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగించే వాడు! కరోనా దెబ్బతో ఆ ఆసరా కూడా పోయింది..! తిండి గింజలు కూడా కొనుక్కోలేని దుర్భర దారిద్ర్యం! సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం అతడి నెలవారీ ఆదాయం లక్షల్లో ఉంది. ఆశ్చర్యపోయారు కదూ..!

ఒకప్పుడు తిండికి లేక అలమటించాడు.. నేడు అతడి నెలవారీ ఆదాయం లక్షల్లో..!

ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలం క్రితం వరకూ అతడో బడుగు జీవి! రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగించే వాడు! కరోనా దెబ్బతో ఆ ఆసరా కూడా పోయింది..! తిండి గింజలు కూడా కొనుక్కోలేని దుర్భర దారిద్ర్యం! సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం అతడి నెలవారీ ఆదాయం లక్షల్లో ఉంది. ఆశ్చర్యపోయారు కదూ..! అవును..ముండా అనే ఒడిశా యువకుడి జీవితాన్ని తరచి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! 


ముండా సంబల్‌పూర్‌ జిల్లా వాసి. అతడికి పెళ్లైంది..పిల్లలు కూడా ఉన్నారు. రోజు కూలిగా పనిచేస్తూ అతడు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ.. కరోనా లాక్‌డౌన్ అతడి జీవితంలో పెను విధ్వంసాన్నే సృష్టించింది. రోజు కూలీ చేస్తూ ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తుంటే..అకస్మాత్తుగా వచ్చి పడిన లాక్‌డౌన్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. లాక్‌డౌన్‌లో అతడికి ఎక్కడా పనులు దొరక్కపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఓ పూట తిండి కూడా దొరకని పరిస్థితి! అయితే..ముండాకు ఎప్పటినుంచో యూట్యూబ్‌లో వీడియోలు చూసే అలవాటు ఉంది. స్నేహితుడి ఫోన్‌లో ఫుడ్ బ్లాగర్లకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తుండేవాడు. 


ఈ క్రమంలోనే అతడికి తనూ యూట్యూబ్ వీడియోలు చేయాలనే ఐడియా వచ్చింది. మరి ముండా ఆర్థిక పరిస్థితేమో దారుణంగా ఉంది. అయినా సరే..మొండికేసి మూడు వేల రూపాయల అప్పుతో ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఓ వీడియో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. తను ఇంట్లో రోజూ ఏం తింటాడు..ఎలా తింటాడు...అనే వివరాలు ఉన్న వీడియో అది. అయితే.. తొలి వీడియోకే అతడు ఎన్నడూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఐదు లక్షల మంది ఈ వీడియోను చూశారు. నెటిజన్లను తెగ ఆకట్టుకున్న వీడియో అది. దీంతో..ప్రజలకు నచ్చే కంటెంట్ ఏంటో అతడికి అర్థమైంది. ఆ తరువాత అతడు వెనక్కుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. 


‘‘నా జీవన విధానానికి సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తా..మేం రోజు ఏం తింటాం..మా ఇల్లు..అక్కడి పరిసరాలు..మా గ్రామంలోని పరిస్థితులు..ఇలా నా రోజువారీ జీవనానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటా’’ అని ముండా చెప్పాడు. తన గ్రామంలోని సామాజిక పరిస్థితులు, సంప్రదాయాలు, నిత్య జీవితంలో తాము ఎదుర్కొనే కష్టాలపై అందరికీ అవగాహన కల్పించేలా వీడియోలు తీయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఇసాక్ ముండా!

Updated Date - 2021-07-09T00:22:47+05:30 IST