పక్కింట్లో నుంచి పాప అరుపులు.. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే సరికి షాకింగ్ దృశ్యం

ABN , First Publish Date - 2021-12-28T11:18:32+05:30 IST

కాలనీలో ఓ 9 ఏళ్ల పాప బయట ఆడుకుంటోంది.. కాసేపు తరువాత కాలనీలోని ఒక ఇంట్లో నుంచి పాప గట్టిగా అరుస్తున్నట్లు విని.. ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. వారిని చూసి ఆ ఇంటి యజమాని పరుగులు తీశాడు. లోపలికి వెళ్లి చూసే సరికి పాప అర్ధనగ్నంగా ఉంది. ఇది చూసిన కాలనీ వాసులు పోలీసులకి సమాచారం...

పక్కింట్లో నుంచి పాప అరుపులు.. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే సరికి షాకింగ్ దృశ్యం

కాలనీలో ఓ 9 ఏళ్ల పాప బయట ఆడుకుంటోంది.. కాసేపు తరువాత కాలనీలోని ఒక ఇంట్లో నుంచి పాప గట్టిగా అరుస్తున్నట్లు విని.. ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. వారిని చూసి ఆ ఇంటి యజమాని పరుగులు తీశాడు. లోపలికి వెళ్లి చూసే సరికి పాప అర్ధనగ్నంగా ఉంది. ఇది చూసిన కాలనీ వాసులు పోలీసులకి సమాచారం అందించారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని ఒక కాలనీలో భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఓ 9 ఏళ్ల పాప ఉంది. ఆ రోజు స్కూలుకి శెలవు ఉండడంతో పాప ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. పాప తల్లి పక్కింటి ఆంటీకి.. పాపను అప్పజెప్పి పనికి వెళ్లిపోయింది. ఆంటీకి పాప బయట ఆడుకునేందుకు వెళుతున్నాను అని చెప్పి పోయింది. అలా పాప బయట ఆడుకుంటున్న సమయంలో అదే కాలనీలో ఉండే ఒక అంకుల్ చాక్లెట్ ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పాపపై అత్యాచారం చేయబోగా.. పాప భయపడి ఏడుస్తూ గట్టిగా అరిచింది. పాప అరుపులకు ఆంటీ, ఇరుగుపొరుగు వారు ఏమైందోనని వెళ్లి చూశారు. వారంతా రావడం చూసి ఆ అంకుల్ పారపోయాడు. అర్ధనగ్నంగా ఉన్న పాపను వారంతా కాపాడి పోలీసులకు ఫోన్ చేశారు. 

పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2021-12-28T11:18:32+05:30 IST