Festival of lights: సర్‌ప్రైజ్ చేసిన NASA

ABN , First Publish Date - 2021-11-05T21:20:56+05:30 IST

దేశం నిన్న దీపావళిని ఘనంగా జరుపుకుంది. బాణసంచా ధరలు తారాజువ్వల్లా ఆకాశానికి ఎగిరినా పండుగ వేళ

Festival of lights: సర్‌ప్రైజ్ చేసిన NASA

న్యూఢిల్లీ: దేశం నిన్న దీపావళిని ఘనంగా జరుపుకుంది. బాణసంచా ధరలు తారాజువ్వల్లా ఆకాశానికి ఎగిరినా పండుగ వేళ లెక్కచేయని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా మెరుపుల్లో భూగోళం వెలిగిపోయింది. అది ఎందాకా అంటే విశ్వం మొత్తం గమనించేంతగా. పైనున్న ఇతర గ్రహాలు కూడా ఆసక్తిగా తిలకించేంతగా! 


నింగికెగసిన తారాజువ్వలు.. చిచ్చుబుడ్ల వెలుగులు, మతాబుల మెరుపులు, భూచక్రాల గింగిరులు విశ్వాన్ని కాంతిమంతం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వయంగా వెల్లడించింది. అంతరిక్షం నుంచి హబుల్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను నాసా పంచుకుంది. దీపావళి కాంతుల్లో అంతరిక్షం ఓ పాలపుంతలా మారిపోయింది. కోట్లాది నక్షత్రాలు ఒకే చోట చేరినట్టుగా ఉన్న ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షలాదిమంది ఈ ఫొటోను లైక్ చేశారు.   


ఎప్పటిలానే దీపావళినాడు అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలను షేర్ చేయాలంటూ చాలామంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్), నాసాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో హబుల్ టెలిస్కోప్ తీసిన ఫొటోను నాసా షేర్ చేసింది.

Updated Date - 2021-11-05T21:20:56+05:30 IST