ఈ అడవుల్లో కాలుమోపారో మీ పని ఖతం.. చివరికి మృతదేహం కూడా దొరకదు.. వివరాలు తెలిస్తే వామ్మో.. అంటారు!

ABN , First Publish Date - 2021-10-28T14:06:56+05:30 IST

సంస్కృతి, నాగరికతలతో పాటు భారతదేశం..

ఈ అడవుల్లో కాలుమోపారో మీ పని ఖతం.. చివరికి మృతదేహం కూడా దొరకదు.. వివరాలు తెలిస్తే వామ్మో.. అంటారు!

సంస్కృతి, నాగరికతలతో పాటు భారతదేశం ప్రకృతి సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అనేక అడవులు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత ప్రమాదకరమైన అడవులు కూడా ఉన్నాయి, అక్కడకు వెళితే ఎవరూ తిరిగిరాలేరు. చివరికి వారి మృతదేహం లభ్యం కావడం కూడా కష్టమే. ఇంతటి భయంకరమైన అడవులు ఎక్కడున్నాయో, వాటి విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సుందర్బన్ ఫారెస్ట్, పశ్చిమ బెంగాల్

సుందర్బన్ అడవిని దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవిగా పరిగణిస్తారు. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఈ దట్టమైన అడవి గంగానదీ తీరంలో ఉంది. ఈ అడవి సుమారు 10 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ అడవి రాయల్ బెంగాల్ టైగర్‌‌ల ఆవాసంగా ప్రసిద్ధి చెందింది.  అత్యంత ప్రమాదకరమైన మొసళ్లు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో కనిపిస్తాయి.  భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ అడవి విస్తరించివుంది. 

గిర్ ఫారెస్ట్, గుజరాత్

గిర్ ఫారెస్ట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద అడవి. గుజరాత్‌లో ఉన్న గిర్ ఫారెస్ట్.. ఆసియా సింహాలకు ప్రసిద్ధిచెందింది. ఈ ప్రమాదకరమైన అడవి సోమనాథ్‌కు ఈశాన్యంగా 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవి వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే ఆసియా సింహాలు కనిపించే మొదటి అడవి గిర్ ఫారెస్ట్. 


ఖాసీ హిల్స్ ఫారెస్ట్, మేఘాలయ

ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద అడవి. ఇది మేఘాలయలోని ఖాసీ పర్వతాల మధ్య ఉన్న ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణాన చిరపుంజి ఉన్న కారణంగా, ఈ అడవిలో సంవత్సరంలో ప్రతి రోజూ వర్షం కురుస్తుంది. ఖాసీ పర్వతాలపైన ఈ అడవి 1,978 మీటర్ల ఎత్తులో ఉంది. మేఘాలయలోని 75 శాతం భూభాగంలో అడవులు ఉన్నాయి.

నమ్దఫా ఫారెస్ట్, అరుణాచల్ ప్రదేశ్

నమ్దఫా.. భారతదేశంలో నాలుగవ అతిపెద్ద అడవి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ అడవి 1,985 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దేశంలో మరెక్కడా కనిపించని జంతువులు ఈ అడవిలో కనిపిస్తాయి. అతి శీతల ప్రాంతంలో నివసించే రెడ్ పాండా, రెడ్ ఫాక్స్ లాంటి జంతువులు ఈ అడవుల్లో కనిపిస్తాయి.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్

జిమ్ కార్బెట్ నేషనల్ ఫారెస్ట్.. భారతదేశంలోని ఐదవ అతిపెద్ద అడవి. అంతరించిపోతున్న పులుల సంరక్షణ కోసం 1936లో ఈ పార్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌లో ఉన్న జిమ్ కార్బెట్ అడవి 520 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అడవి బెంగాల్ టైగర్‌‌లకు ప్రసిద్ధి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అత్యంత పురాతన జాతీయ పార్కుగా పేరొందింది. 

Updated Date - 2021-10-28T14:06:56+05:30 IST