కోతుల మందు పార్టీ!
ABN , First Publish Date - 2021-04-09T19:12:09+05:30 IST
`మీరే కాదు.. మేం కూడా మందు పార్టీ చేసుకుంటాం` అంటూ కర్ణాటకలోని ఓ మద్యం షాపు ముందు కోతులు చెలరేగిపోయాయి.
కర్ణాటకలోని ఓ మద్యం షాపు ముందు కోతులు మందు పార్టీ చేసుకున్నాయి. బెంగళూరు రూరల్ విజయపుర పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కొన్ని కోతులు విజయపుర పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్దకు వచ్చాయి. అక్కడ ఉన్న ఖాళీ మద్యం సీసాలను, వాటర్ పాకెట్లను ఏరి అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చాయి. సీసాలలో మిగిలిపోయిన మద్యాన్ని తాగేశాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్గా మారాయి.