ఫ్రిజ్‌లో పాలను తీసి వేడి చేయగానే ఊహించని పరిణామం.. రబ్బర్‌గా మారిపోవడంతో షాక్..!
ABN , First Publish Date - 2021-08-29T18:00:49+05:30 IST
ప్రిజ్‌లోంచి తీసిన పాలు వెచ్చచేయబోతే ఊహించని పరిణామాం..రబ్బర్లాగా మారిపోయిన వైనం
ఇంటర్నెట్ డెస్క్: టీ తాగుదామనుకుని ఆ మహిళ ఫ్రిజ్‌లోంచి పాల ప్యాకెట్ బయటకు తీశారు. ఓ గిన్నెలో పాలు పోసి వేడిచేసేందుకు స్టవ్‌పై పెట్టి మరోపనిలో మునిగిపోయారు. పది నిమిషాల తరువాత.. గిన్నెలోకి తొంగి చూస్తే.. నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది! పాలు కాస్తా.. ఒక్కసారిగా రబ్బర్ లాగా మారిపోయాయి. జిగటలాగా సాగుతున్న తెల్లటి ముద్దలు పాలలో కనిపించాయి. పాలు విరిగిపోయి ఉండొచ్చని తొలుత ఆమె భావించారు.
కానీ..మరింత నిశితంగా పరిశీలిస్తే.. అవి అచ్చం రబ్బర్ లాగా అసాధారణ రీతిలో సాగుతూ కనిపించాయి. దీంతో..షాకైపోయిన మహిళ ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇటువంటి ఘటనను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ వీడియో ఆధారంగా ఆమె సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నగరంలో ఇటీవల వెలుగు చూసింది.
కాగా.. ఈ ఘటనకు తాను బాధ్యత తీసుకోనని ఆమెకు పాలు విక్రయించిన డెయిరీ షాపు యజమాని తేల్చి చెప్పారు. తన దగ్గర రోజూ వందల మంది పాలు కొనుక్కుని వెళుతుంటారని, పాలల్లో సమస్య ఉంటే గనుక.. ఇటువంటి ఫిర్యాదులు ఇప్పటికే బోలేడన్ని వచ్చి ఉండాలని వ్యాఖ్యానించారు. మరోవైపు.. డ్రగ్ ఇస్ఫెక్టర్.. డెయిరీ షాపులోని పాలు, ఇతర పదార్థాల శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ పరీక్షల తాలూకు ఫలితాలు వచ్చాకే అసలు ఏం జరిగిందనేది తేలుతుందని పేర్కొన్నారు.