పురుషుల ఛాతీపై దట్టంగా పెరిగిన వెంట్రుకలు.. దేనికి సంకేతమో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-10-28T12:56:30+05:30 IST

పురుషుల ఛాతీపై దట్టంగా పెరిగిన వెంట్రుకలు..

పురుషుల ఛాతీపై దట్టంగా పెరిగిన వెంట్రుకలు.. దేనికి సంకేతమో తెలిస్తే షాకవుతారు!

పురుషుల ఛాతీపై దట్టంగా పెరిగిన వెంట్రుకలు మగతనానికి గుర్తుగా భావిస్తుంటారు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో కొందరు పురుషులు తమ ఛాతీపై వెంట్రుకలు ఉంచుకునేందుకు ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. పురుషుల ఛాతీపై పెరిగిన వెంట్రుకలు ఆ వ్యక్తికి సంబంధించిన వివిధ లక్షణాలకు సంకేతాలు. వీటి గురించి చాలామందికి తెలియదు. ఈ ఆసక్తికరమైన ఆ వివరాలు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పురుషుల ఛాతీపై దట్టంగా వెంట్రుకలు పెరగడంపై ప్రపంచంలోని వివిధ దేశాలలో పలు నమ్మకాలున్నాయి. ఏదిఏమైనప్పటికీ శరీరంలోని ప్రతీ అణువుకూ ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనేది సత్యం. 
ఇదేవిధంగా పురుషుని ఛాతీపై పెరిగే వెంట్రుకల విషయంలోనూ ఒక ప్రత్యేకత ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా  పుట్టుమచ్చలు ఉండటం, గోళ్లకు ఉండే సహజరంగు, ఛాతీపై వెంట్రుకలు, చెంపపై పుట్టుమచ్చ, స్త్రీ ఛాతీపై పుట్టుమచ్చ మొదలైనన్నీ ఏదో ఒక లక్షణానికి సంకేతంగా భావిస్తారు. ఈ కోవలోనే పురుషుల ఛాతీ పెరిగే వెంట్రుకలు అతని అదృష్టాన్ని, స్వభావాన్ని సూచిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నేపధ్యంలో పురుషుల శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయి. పురుషులకు సాధారణంగా 14-15 ఏళ్ల వయసులో ముఖంపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. పురుషుల శరీరంలో హార్మోన్స్ విడుదల కారణంగా శరీరంపై వెంట్రుకలు మొలుస్తాయి. అయితే ఇది ఆ వ్యక్తి డీఎన్ఏపై ఆధారపడివుంటుంది. కుటుంబంలోని తాత, ముత్తాతలకు శరీరంపై వెంట్రుకలు దట్టంగా పెరిగితే.. వారి సంతానంలోని పురుషులకు కూడా ఇదే లక్షణం వచ్చేందుకు అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంపై వెంట్రుకల పెరుగుదల అనేది అని టెస్టోస్టెరాన్‌పై ఆధారపడివుంటుంది. ఈ టెస్టోస్టెరాన్‌లో ఆండ్రోజెన్ మోతాదు అధికంగా ఉంటే శరీరంలోని ఛాతీపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఏ పురుషుని శరీరంపై అధికంగా వెంట్రుకలు పెరుగుతాయో.. అతను మిగిలిన పురుషుల కన్నా అదృష్టవంతుడు. శరీరంపై అత్యధికంగా వెంట్రుకలు ఉన్న పురుషులు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇటువంటి పురుషులు ఇతరులను ఆదరించడంలోనూ, నిజాన్ని మాట్లాడటంలోనూ ముందుంటారు. జీవితంలోని చాలా విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఛాతీపై అత్యధికంగా వెంట్రుకలు కలిగిన పురుషులు ఎంతో కష్టపడి పనిచేసేవారిగా గుర్తింపు పొందుతారు. అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటారు. మోసం చేసేందుకు వెనుకాడతారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగివుంటారు. అందరితో కలసిపోయి ముందుకుసాగే ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. 

Updated Date - 2021-10-28T12:56:30+05:30 IST