సెల్ఫీ తీసుకోబోయి బావిలో.. కాపాడబోతే..
ABN , First Publish Date - 2021-02-22T00:42:20+05:30 IST
బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి చివరకి అదే బావిలో పడిపోయింది. దారిన పోతున్న యువకుడు ఇది గమనించి ఆమెను కాపాడ్డానికి..
బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి చివరకి అదే బావిలో పడిపోయింది. దారిన పోతున్న యువకుడు ఇది గమనించి ఆమెను కాపాడ్డానికి ఆ బావిలో దూకేశాడు. సేవ్ అయితే చేశాడు కానీ.. ఎలా బయటికి రావాలో తెలియలేదు. దాంతో ఇద్దరూ కలిసి హెల్ప్.. హెల్ప్.. అంటూ అరుపులు మొదలెట్టారు. ఈ అరుపులు విన్న గ్రామస్థులు.. వారిద్దర్నీ తాళ్లతో బయటకు లాగి అతి కష్టం మీద కాపాడగలిగారు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామంలో జరిగింది.