నాలుగేళ్లుగా అక్కతో సంబంధం.. తరువాత మైనర్ చెల్లితో కూడా.. చివరికి ఆ కామాంధుడి గతి

ABN , First Publish Date - 2021-10-27T11:55:14+05:30 IST

దేశంలో స్త్రీలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. స్త్రీలను హింసించే మృగాళ్లను కఠినంగా శిక్షించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కేసులు రోజుకు పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి...

నాలుగేళ్లుగా అక్కతో సంబంధం.. తరువాత మైనర్ చెల్లితో కూడా.. చివరికి ఆ కామాంధుడి గతి

దేశంలో స్త్రీలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కేసులు రోజుకు పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఒక క్రూర ఘటన ఆ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ నగరంలో ఇటీవలే జరిగింది. ఒకేసారి ఇద్దరి యువతులు.. అది కూడా వారిద్దరూ అక్కాచెల్లెళ్లు తమపై ఒకే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ఆ చెల్లెలు మైనర్ కావడం విశేషం.


నిందితుడు ప్రతాప్ జబల్‌పూర్ నగరంలోని ఒక త్రీ స్టార్ హోటల్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  అదే హోటల్‌లో కమల(పేరు మార్చబడినది) పార్ట్ టైం జాబ్ చేస్తోంది. కమల ఒక నర్సింగ్ విద్యార్థిని కూడా. తన కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆ హోటల్‌లో 2017 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. ప్రతాప్ కమలతో సన్నిహితంగా మెలిగేవాడు. అలా 2017లో ఒకరోజు కమలకు కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తు మందు కలపడం వల్ల.. కూల్ డ్రింక్ తాగిన తరువాత కమల స్పృహ కోల్పోయింది. ఆ తరువాత ప్రతాప్ కమలపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియోని ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని కమలను బ్లాక్ మెయిల్ చేసి  ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. 


ఇటీవల (2021 సంవత్సరం మార్చి) కమల చెల్లెలు పుష్ప(17, పేరు మార్చబడినది) కూడా చదువుకునేందుకు జబల్‌పూర్ వచ్చింది. పుష్ప ఆ హోటల్‌లో తన అక్కను కలుసుకునేందుకు అప్పుడప్పుడూ వచ్చేది. ఇది తెలిసిన ప్రతాప్.. పుష్పను కూడా అలాగే పొందాలనుకున్నాడు. కమలకు ఇష్టంలేకపోయినా ప్రతాప్‌తో సన్నిహితంగా ఉండేది. అలా ఒకరోజు కమలను కలిసేందుకు పుష్ప హోటల్‌కు వచ్చినప్పుడు.. వారిద్దరినీ తన కారులో షికారుకి ప్రతాప్ తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరికీ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఈ సారి పుష్పపై అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ పాడుపని చేస్తూ వీడియో తీశాడు. 


స్పృహ వచ్చాక కమల, పుష్ప ఇద్దరూ జరిగింది తెలిసి ఏడ్చారు. ఏం చేయాలో? తెలియలేదు. మళ్లీ ప్రతాప్ ఆ వీడియో చూపించి పుష్పపై కూడా అలాగే బలవంతం చేశాడు. ఇదంగా చూసి కమల ఓర్పు నశించింది. తనపై అత్యాచారం జరిగినా సహించిన కమల, తన చెల్లెలిపై ఇలా జరగడం సహించలేకపోయింది. పుష్పను వెంట తీసుకొని మహిళా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగినదంగా చెప్పింది. పోలీసులు రెండు వేర్వేరు అత్యాచార ఫిర్యాదులు నమోదు చేసుకున్నారు. 


పుష్ప మైనర్ కావడంతో ప్రతాప్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రతాప్‌ను అరెస్టు చేయడానికి వెళ్లగా అతను పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు  అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2021-10-27T11:55:14+05:30 IST