నిద్రపోతున్న ప్రేయసి కనురెప్పలను తెరచి మరీ ఆమె ఫోన్‌ను అన్‌లాక్ చేసి.. పక్కా ప్లాన్‌తో ఆ ప్రియుడు చేసిన నిర్వాకమిది..!
ABN , First Publish Date - 2021-12-14T21:04:50+05:30 IST
ప్రస్తుతం మన సమస్త సమాచారం స్మార్ట్ ఫోన్లలోనే నిక్షిప్తమై ఉంటోంది. మన వ్యాపార లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలు కూడా ఫోన్ ద్వారానే అయిపోతున్నాయి
ప్రస్తుతం మన సమస్త సమాచారం స్మార్ట్ ఫోన్లలోనే నిక్షిప్తమై ఉంటోంది. మన వ్యాపార లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలు కూడా ఫోన్ ద్వారానే అయిపోతున్నాయి. దీంతో కాలు కదపకుండానే పనులు జరిగిపోతున్నాయి. అలాగే సైబర్ మోసాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసి నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్ అన్‌లాక్ చేసి ఏకంగా రూ.18.5 లక్షలు కొట్టేశాడు.
చైనాలోని నానింగ్కు చెందిన హువాంగ్ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు డాంగ్ ఫోన్ నుంచి ఏకంగా రూ.18 లక్షలు కొట్టేశాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమె కనురెప్పలు తెరిచి ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. అనంతరం ఆ ఫోన్లోని ఆమె బ్యాంక్ ఖాతాలను తెరిచి 150,000 యువాన్లను తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆమె చేతి వేలి ముద్రల ద్వారా సునాయాసంగా పని పూర్తి చేశాడు. తర్వాత సైలెంట్‌గా అక్కణ్నుంచి జారుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఆమె బ్యాంక్ నుంచి వచ్చిన విత్ డ్రా మెసేజ్‌లను చూడడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హువాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంబ్లింగ్ కోసం ఆ డబ్బును కాజేసినట్టు హువాంగ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. కోర్టు అతనికి రూ. 2లక్షలు జరిమానాతోపాటు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.